News February 26, 2026

నెల్లూరు: ఒక్కరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ

image

ఈ నెల పింఛన్లను ఒక్క రోజు ముందుగానే ఇచ్చేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. మార్చి నెల ఒకటో తేదీన ఆదివారం రావడంతో ఫిబ్రవరి 28న పింఛన్ నగదును పంపిణీ చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 289647 పింఛన్లకు సంబంధించి రూ.126.91 కోట్లను అందజేస్తున్నట్లు DRDA పీడీ నాగరాజకుమారి తెలిపారు.

Similar News

News March 1, 2026

నెల్లూరు గృహ నిర్మాణ శాఖ ఈఈ బదిలీ

image

గృహ నిర్మాణ శాఖ సంస్థ నెల్లూరు డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎంవీ మోహన్ రావు బదిలీ అయ్యారు. ఈ మేరకు సంబంధిత శాఖ నుంచి శనివారం ఉత్తర్వులు వెలుపడ్డాయి. ఆయనను కొత్తగా ఏర్పడ్డ మార్కాపురం జిల్లా హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పూర్తి అదనపు బాధ్యతలతో నియమించారు. కాగా మోహన్ రావు స్థానంలో ఇక్కడ ఎవరినీ నియమించలేదు.

News March 1, 2026

నెల్లూరు జిల్లా YCPలో ఆయన ఫేవరెట్టా.?

image

ఎన్నికల్లో ఓటమితో జిల్లాలో డీలాపడ్డ YCPకి MLC చంద్రశేఖర్ రెడ్డి అండగా ఉన్నారు. అనిల్, కాకాణి వంటి నేతలు పార్టీకి కొంత కాలం దూరంగా ఉండటం, ఆ సమయంలో కూటమికి దీటుగా సమాధానం ఇవ్వడం, కార్యకర్తలు, నేతలకు భరోసా ఇవ్వడంతో చంద్రశేఖర్ రెడ్డి జగన్ దృష్టిని ఆకర్షించారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు అర్బన్ నుంచి ఆయన్ను బరిలో దింపనున్నట్లు చర్చ జరుగుతోంది. వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండటం ఆయనకు కలిసొస్తుందంటున్నారు.

News February 28, 2026

వైద్యాధికారులకు నోటీసులు పంపుతాం: DMHO

image

స్కానింగ్ రెన్యువల్ చేయని సీహెచ్సీలు స్కానింగ్ సెంటర్లకు నోటీసులు జారీ చేసేందుకు తీర్మానించినట్లు జిల్లా వైద్యాధికారి సుజాత తెలిపారు. జిల్లాస్థాయి సలహా సంఘంతో పిండ, లింగ నిర్ధారణపై జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్కానింగ్ రెన్యువల్‌లో నిర్లక్ష్యంగా ఉన్న వెంకటాచలం, ఉదయగిరి సీహెచ్సీలకు, మార్పు చేయుటలో నిర్లక్ష్యంగా ఉన్న పొదలకూరు, కావలి ఫోకస్ డయాగ్నస్టిక్ సెంటర్‌కు నోటీసులు జారీ చేస్తామన్నారు.