News May 3, 2024
HYD: హోటల్ యజమాని హత్య

HYD గచ్చిబౌలిలో ఓ హోటల్ యజమాని ఈరోజు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానిక అంజయ్య నగర్‌లో శ్రీనివాస్ (54) అనే వ్యక్తి హోటల్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో దారి విషయంలో ఏడాది క్రితం హోటల్ పక్కన నివసించే వ్యక్తితో అతడికి గొడవ జరిగింది. కక్ష కట్టిన సదరు వ్యక్తి ఇనుప రాడ్డుతో దాడి చేయడంతో శ్రీనివాస్ మృతిచెందాడు. మృతుడి కుమారుడు కేశవ్ ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News November 5, 2025
HYD: 19 మంది చనిపోయినా గుంత పూడ్చలే?

చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు పోవడానికి కారణమైన గుంతను పూడ్చే విషయంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. యాక్సిడెంట్ నేపథ్యంలో ఈ గుంతను మంగళవారం ఉదయం డస్ట్‌తో పూడ్చారు. సాయంత్రం డస్ట్ అంతా కొట్టుకుపోయి మళ్లీ గుంత యథాస్థితికి వచ్చింది. రాత్రి సమయంలో ఈ గుంత ప్రమాదకరంగా కనిపించింది. ఇంత ఘోరం జరిగినా అధికార యంత్రాంగంలో చలనం లేకపోవడం గమనార్హం.
News November 5, 2025
HYD: డ్రంక్ & డ్రైవ్‌లో దొరికి PS ముందే సూసైడ్

మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో డ్రైవర్ సూసైడ్ కలకలం రేపింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ ఒక వ్యక్తి కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుటే ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు దమ్మాయిగూడకు చెందిన మీన్ రెడ్డిగా గుర్తించారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News November 5, 2025
KPHB: OYOలో పోలీసుల RAIDS

KPHBకాలనీలోని హోటళ్లలో అసాంఘిక కార్యక్రమాలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. తాజాగా రోడ్ నం.3లోని OYO హోటల్‌లో రైడ్స్ చేశారు. ఈ సోదాల్లో 6 కిలోల గంజాయి పట్టుబడింది. నిందితులు కాకినాడకు చెందిన జ్యోతి, అజయ్ (27), రమేశ్ (28)గా గుర్తించారు. APలో గంజాయి కొనుగోలు చేసి నగరంలో అధిక ధరకు విక్రయిస్తున్నారు. OYOలో రూమ్ అద్దెకు తీసుకొని మరీ వ్యాపారం మొదలుపెట్టినట్లు పోలీసులు గుర్తించారు.


