News February 26, 2026
రష్మిక-విజయ్ పెళ్లి ఫొటోలు

విజయ్ దేవరకొండ-రష్మిక ఇవాళ ఉదయం గ్రాండ్‌గా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా పెళ్లి ఫొటోలను రష్మిక తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ‘నా భర్తను మీకు పరిచయం చేస్తున్నా’ అని క్యాప్షన్ ఇచ్చారు. విజయ్ సైతం పెళ్లి ఫొటోలను SMలో షేర్ చేశారు. దీంతో అభిమానులు విరోష్ జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు.
Similar News
News March 4, 2026
చిరంజీవి కొత్త సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

‘వాల్తేరు వీరయ్య’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబోలో మరో మూవీని తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజాగా ఫైనల్ స్క్రిప్ట్ లాక్ అయినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్‌లో చిరు స్టైలిష్‌గా కనిపిస్తారని, భారీ క్లైమాక్స్ సెటప్ ఆడియన్స్‌ను ఆశ్చర్యపరుస్తుందని తెలిపాయి. ఇందులో పెద్ద స్టార్లు నటించబోతున్నారని, త్వరలో పూజా కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నాయి.
News March 4, 2026
బస్సుల్లో తగ్గిన పురుష ప్రయాణికుల సంఖ్య

AP: ‘స్త్రీ శక్తి’ పథకంతో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. FEBలో నిత్యం 26 లక్షల మంది ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నట్లు RTC తెలిపింది. దీంతో ఆక్యుపెన్సీ 92% దాటింది. అదే సమయంలో పురుషులు బస్సుల్లో ట్రావెల్ చేయడానికి జంకుతున్నారు. వారి సంఖ్య 37శాతానికి పడిపోయింది. బస్సుల్లో సీట్లు దొరకకపోవడమే దీనికి ప్రధాన కారణం. తాము డబ్బులు చెల్లిస్తున్నా సౌకర్యంగా ప్రయాణించలేకపోతున్నామని వారు వాపోతున్నారు.
News March 4, 2026
ఆయిల్ టెన్షన్ అక్కర్లేదు.. 8 వారాల నిల్వలు

ఇరాన్ ఉద్రిక్తతలు నెలల తరబడి కొనసాగొచ్చని విశ్లేషణలు వస్తున్నా భారత్‌లో చమురు సంక్షోభం తలెత్తే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మన వద్ద 8వారాలకు సరిపడా నిల్వలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. హార్ముజ్ జలసంధి నుంచి వచ్చే చమురు 40% మాత్రమే కాగా.. ప్రత్యామ్నాయంగా క్రూడాయిల్ అందించేందుకు రష్యా ముందుకొచ్చింది. అటు హార్ముజ్ నుంచి వెళ్లే నౌకలకు రక్షణ కల్పిస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు.


