News February 26, 2026
క్షేత్రస్థాయిలో రైతులకు పథకాలు అమలు చేయాలి: కలెక్టర్

పీఎం ధన ధాన్య కృషి యోజన అమలుపై గురువారం కేంద్ర అధికారి సిద్ధార్థ జైన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. పుట్టపర్తి కలెక్టర్‌లో కలెక్టర్‌తో పాటు వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో రైతులకు పథకాలు మరింత చేరువ చేయాలన్నారు. ఆధునిక సాగు పద్ధతులపై దృష్టి సారించాలని, చియా పంటను జిల్లా అంతట విస్తరింపజేయాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News February 27, 2026
డయేరియా ప్రాంతంలో రాష్ట్ర వైద్యఆరోగ్య కమిషనర్ పర్యటన

శ్రీకాకుళం నగరంలో డయేరియా ప్రబలిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్ శుక్రవారం పర్యటించారు. దమ్మలవీధిలో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వ్యాధికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. తగిన సమయంలో వైద్యం అందించారా లేదా అని డీఎంహెచ్‌ఓ డాక్టర్ అనితను ప్రశ్నించారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఫార్మాన్ ఖాన్ ఉన్నారు.
News February 27, 2026
MNCL: బాల్క సుమన్ బెయిల్ పిటిషన్ వాయిదా

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బెయిల్ పిటిషన్‌పై విచారణను మంచిర్యాల జిల్లా కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. శుక్రవారం పబ్లిక్ ప్రాసిక్యూటర్, సుమన్ తరఫు న్యాయవాదుల మధ్య సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తుది నిర్ణయాన్ని వాయిదా వేశారు. ప్రస్తుతం సుమన్ ఆదిలాబాద్ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ఈ కేసులో తదుపరి విచారణ సోమవారం జరగనుంది.
News February 27, 2026
రూ.151కే భద్రాచలం రాములోరి తలంబ్రాలు

శ్రీరామనవమిని పురస్కరించుకుని భద్రాచల సీతారామచంద్రస్వామి కల్యాణ తలంబ్రాలను భక్తుల ముంగిటకే చేర్చేందుకు
TGSRTC ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శుక్రవారం ఖమ్మం ఆర్ఎం శ్రీరామ్ ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. మార్చి 27న భద్రాద్రిలో జరిగే కల్యాణోత్సవానికి వెళ్లలేని భక్తుల కోసం రూ.151కే తలంబ్రాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గలవారు tgsrtclogistics.gov.in లో బుక్ చేసుకోవాలన్నారు.


