News May 3, 2024

ఓటీటీలోకి వచ్చేస్తున్న మలయాళం బ్లాక్‌బస్టర్ మూవీ

image

మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ ‘ఆవేశం’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. పుష్ప మూవీ ద్వారా పాన్ ఇండియా లెవల్‌లో గుర్తింపు తెచ్చుకున్న ఫహద్ ఫాజిల్ ఇందులో ప్రధాన పాత్రలో నటించారు. మలయాళంలో ఈ చిత్రం రూ.130 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి అదరగొట్టింది. కాగా ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. మే 9 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. తెలుగు వెర్షన్‌లో కూడా అందుబాటులో ఉండే ఛాన్సుంది.

Similar News

News March 18, 2026

‘ధురంధర్-2’ పబ్లిక్ టాక్

image

‘ధురంధర్-2’ ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకులు Xలో రివ్యూలు ఇస్తున్నారు. ఫిల్మ్ మేకింగ్ అదిరిపోయిందని, రణ్‌వీర్ సింగ్ నటన, ఇంటర్వెల్ అద్భుతం అని ప్రశంసిస్తున్నారు. డైరెక్టర్ ఆదిత్య ధార్ 4 గంటల సినిమాను ఎక్కడా బోర్ కొట్టకుండా తెరకెక్కించారని చెబుతున్నారు. హింసాత్మక సీన్లు ఎక్కువగా ఉన్నా దేశభక్తి సినిమా కాబట్టి జస్టిఫై చేసేలా ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు.
*Way2News ఫుల్ రివ్యూ రేపు ఉదయం..

News March 18, 2026

మహిళా ఓటర్ల ఫేవర్ ఎవరికో? (1/2)

image

నాలుగు రాష్ట్రాలు, ఓ యూటీ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైన వేళ మరోసారి మహిళా ఓటర్ల డామినేషన్ చర్చనీయాంశమైంది. 2025 బిహార్, ఢిల్లీ ఎన్నికల్లో ఉమెన్ ఫ్యాక్టర్ వర్కౌట్ అయింది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా మహిళలను ఆకట్టుకునేందుకు పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. అస్సాంలో 1.25Cr (49.97%), బెంగాల్‌లో 3.16Cr (49%), TNలో 2.89Cr (51.07%), కేరళంలో 1.38Cr (51%), పుదుచ్చేరి 5.3లక్షలు (53%) మహిళా ఓటర్లు ఉన్నారు.

News March 18, 2026

మహిళా ఓటర్ల ఫేవర్ ఎవరికో? (2/2)

image

మహిళలు డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా ఉన్నారు కాబట్టే WBలో మమతా సర్కార్‌‌ ఇచ్చిన లక్ష్మిర్ భండార్ స్కీమ్‌కు కౌంటర్‌గా ₹5700Cr ప్యాకేజ్, అన్నపూర్ణ యోజనతో నెలకు ₹3వేలు ఇస్తామని BJP ప్రకటించింది. TNలో నెలకు ₹2500, ఆడశిశువులకు గోల్డ్ రింగ్ వంటి హామీలొచ్చాయి. కేరళంలో పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అస్సాంలో మహిళా సంఘాలే తమ డిమాండ్స్‌పై మ్యానిఫెస్టో ప్రకటించాయి. మరి మహిళలు గేమ్ ఛేంజర్‌గా మారతారో చూడాలి.