News February 26, 2026

హార్వర్డ్‌ను హైదరాబాద్‌కు తీసుకొస్తున్నాం: CM రేవంత్

image

TG: హార్వర్డ్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని గ్రూప్-1,2 ఆఫీసర్ల శిక్షణ ముగింపు కార్యక్రమంలో CM రేవంత్ వెల్లడించారు. ‘ఇక్కడి నుంచి హార్వర్డ్‌కు వెళ్లేందుకు చాలామందికి కష్టమవుతోంది. అందుకే MCHRD-హార్వర్డ్ మధ్య ఓ ఒప్పందం చేసుకుంటున్నాం. వాళ్లే ఇక్కడికి వచ్చి ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ క్లాసెస్ చెబుతారు’ అని రేవంత్ వివరించారు. ఇక ఆఫీసర్లంతా తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని సూచించారు.

Similar News

News March 5, 2026

ఏపీలో టీనేజీ ప్రెగ్నెన్సీలు.. కారణాలివే: శైలజ

image

AP: <<19092441>>టీనేజీ ప్రెగ్నెన్సీల్లో<<>> ఏపీ జాతీయ స్థాయిలో మూడో స్థానంలో ఉండటంపై రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ ఆవేదన వ్యక్తం చేశారు. SM ఆకర్షణలు, పేరెంట్స్ చదువుకోకపోవడం, అవగాహన కొరతే దీనికి కారణమన్నారు. విజయవాడలో మాట్లాడుతూ ‘చిన్న వయసులోనే గర్భధారణను తగ్గించడానికి కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాం. తల్లిదండ్రులు, బాలికలకు అవగాహన కల్పిస్తున్నాం’ అని తెలిపారు.

News March 5, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News March 5, 2026

ఇజ్రాయెల్ ఎంబసీలన్నీ ధ్వంసం చేస్తాం.. ఇరాన్ వార్నింగ్

image

లెబనాన్‌లోని తమ ఎంబసీపై ఇజ్రాయెల్ దాడి చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆ దేశ ఎంబసీలు అన్నింటిపై దాడులకు దిగుతామని ఇరాన్ హెచ్చరించింది. ఈ మేరకు ఇరాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రతినిధి షెకార్చి ప్రకటించారు. అంతకుముందు లెబనాన్‌లోని ఇరాన్ ఎంబసీలో ఉంటున్న ప్రతినిధులు ఖాళీ చేయాలని.. ఇందుకు 24 గంటల గడుపు ఇస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. హెజ్బొల్లా మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ లెబనాన్‌పై దాడులు చేస్తోంది.