News February 26, 2026

సిరిసిల్ల : 68 మంది విద్యార్థులు గైర్హాజరు

image

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు గురువారం జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 16 కేంద్రాలలో వార్షిక పరీక్షలు నిర్వహిస్తుండగా మొదటిరోజు 3814 మంది విద్యార్థులకు గాను 3746 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు అధికారులు తెలిపారు. 68 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరు అయ్యారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ కోసం జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది.

Similar News

News March 11, 2026

VKB: ‘అవకాశాలను మహిళలు అందిపుచ్చుకోవాలి’

image

మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా సాగుతుందని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. జిల్లా కలెక్టరేట్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ప్రోత్సహించాలని తెలిపారు. మహిళలు తమకు వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి దిశగా ముందడుగు వేయాలన్నారు.

News March 11, 2026

అల్లూరి జిల్లాకు రానున్న పవన్ కళ్యాణ్.. ఎప్పుడంటే?

image

ఈనెల 14న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారని జానపద కళలు సాంస్కృతిక సృజనాత్మక అకాడమీ చైర్మన్ గంగులయ్య తెలిపారు. పాడేరులో బుధవారం ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారు అయిందని.. విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ గొర్ల వీర వెంకట్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

News March 11, 2026

TU: MEd మూడో సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని MEd 3వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్‌ను బుధవారం విడుదల చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. ఈ నెల 16 నుంచి 25 వరకు మధ్యాహ్నం 2గం.ల నుంచి 5గం.ల వరకు పరీక్షలు జరగనున్నాయని పేర్కొన్నారు. పరీక్షల పూర్తి వివరాలకోసం విద్యార్థులు యూనివర్సిటీ వెబ్సైట్‌ను సందర్శించాలన్నారు.