News February 26, 2026
బోయినపల్లి: CMO అధికారిని అంటూ మోసం.. అరెస్ట్

రంగారెడ్డి జిల్లా కుట్లూరు ప్రాంతానికి చెందిన సూర్య ప్రకాష్ బెట్టింగులకు బానిసై అధిక డబ్బు సంపాదించాలని దొంగతనాలకు అలవాటుపడ్డాడు. మోటార్ సైకిల్ దొంగలించిన కేసులో అరెస్టై జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత సీఎంఓ కార్యాలయంలో పనిచేస్తానని చెప్పి బోయినపల్లి మిడ్ మానేరు DEE రఘుపతికి కాల్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో రఘుపతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా నిందితుడిని పట్టుకొని రిమాండ్‌కు తరలించారు.
Similar News
News February 27, 2026
మోత్కూరు: అదుపుతప్పి చెట్టుకు ఢీకొన్న కారు

అతివేగం ఓ కారు ప్రమాదానికి కారణమైంది. మోత్కూరు మండల పరిధిలోని పాటిమట్ల గ్రామ ప్రమాదకర మూలమలుపు వద్ద గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మోత్కూరు నుంచి తిరుమలగిరి వెళ్తున్న షిఫ్ట్ కారు మలుపు వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ మలుపు వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు శాశ్వత పరిష్కారం చూపడంలేదని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News February 27, 2026
రేపటి నుంచి ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ పంపిణీ

గర్భాశయ క్యాన్సర్ నివారణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హెచ్‌పీవీ టీకా పంపిణీ శనివారం నుంచి జిల్లావ్యాప్తంగా ప్రారంభం కానుంది. అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఇందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. 14 ఏళ్లు దాటిన ప్రతి బాలికకు ఈ టీకా వేయనున్నారు. వచ్చే 90రోజుల్లో 15 ఏళ్లు నిండే వారు కూడా ఉచితంగా టీకా పొందేందుకు అర్హులని అధికారులు పేర్కొన్నారు.
News February 27, 2026
హుజూర్‌నగర్: 22,500 కోట్లతో ఇండ్ల పథకం: మంత్రి ఉత్తమ్

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.22,500 కోట్లతో 5 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం రామస్వామి వద్ద రూ.125 కోట్లతో నిర్మిస్తున్న 2,160 ఇండ్ల పెండింగ్ పనులను కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్‌తో కలిసి పరిశీలించారు. ప్రతి బ్లాక్‌లో మౌలిక వసతుల పురోగతిని సమీక్షించి, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.


