News February 26, 2026
KNR: పీజీ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన SU రిజిస్ట్రార్

శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలో పీజీ, ఎంబీఏ, ఎంసీఏ మొదటి సెమిస్టర్ పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం కరీంనగర్‌లోని వివేకానంద డిగ్రీ & పిజి కళాశాల పరీక్షా కేంద్రాన్ని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య యు.సతీష్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షలు నడుస్తున్న తీరును పరిశీలించారు.
Similar News
News February 28, 2026
వచ్చే మూడేళ్లలో ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాజెక్టులు పూర్తి: సీఎం

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని పెండింగ్‌లో ఉన్న తాగునీటి ప్రాజెక్టులను వచ్చే మూడేళ్లలో పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. రావివలస ప్రజా వేదికలో ఆయన మాట్లాడారు. పోలవరం నుంచి సుజల స్రవంతి ద్వారా విశాఖకి త్వరలోనే నీరు అందిస్తామన్నారు. వంశధార, నాగావళి, చంపావతి నదులను గోదావరితో అనుసంధానం చేస్తామన్నారు.
News February 28, 2026
నల్గొండ: నేడే ఆఖరు.. 2.42 లక్షల మంది పెండింగ్

జిల్లాలోని రైతులకు ప్రభుత్వం అందించే పథకాలు అందాలంటే తప్పనిసరిగా చేసుకోవాల్సిన ‘ఫార్మర్ రిజిస్ట్రేషన్’ గడువు నేటితో ముగియనుంది. జిల్లా వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం, ఇప్పటివరకు కేవలం 55.06 శాతం మంది రైతులు మాత్రమే తమ పేర్లను నమోదు చేసుకున్నారు. జిల్లాలో మొత్తం 5,39,619 మంది రైతులు ఉండగా, ఇంకా 2,42,492 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. మునుగోడు మండలంలో మాత్రమే అత్యధికంగా (70.22%) నమోదైంది.
News February 28, 2026
సెకండ్ ఇయర్ ఇంగ్లిష్ ఎగ్జామ్‌కు 365 మంది గైర్హాజరు

ఇంటర్ పరీక్షల్లో భాగంగా శనివారం సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లిష్ పరీక్ష నిర్వహించారు. 18,465 మంది విద్యార్థులకు గాను 18,098 మంది విద్యార్థులు హాజరయ్యారు. 367 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ ఘటనలు చోటుచేసుకోలేదని వెల్లడించారు. పరీక్షలు సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.


