News February 26, 2026
గాలివీడులో హత్య కేసు.. ఐదుగురు అరెస్ట్

గాలివీడు మండలంలో జరిగిన హత్య కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. భూవివాదాలు, అన్నదమ్ముల మధ్య వర్గపోరు కారణంగానే ఈ హత్య జరిగినట్లు నిందితులు అంగీకరించారు. రూ.4 లక్షల నగదు (మొదటి ముద్దాయి మహేశ్వర్ రెడ్డి ఇచ్చిన సుపారీ), 7 సెల్ ఫోన్లు, 2 కత్తులు, ఒక కారు, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. కేసును ఛేదించిన డీఎస్పీ కృష్ణమోహన్, CI, SIని ఎస్పీ ధీరజ్ అభినందించారు.
Similar News
News February 27, 2026
అఫ్గాన్‌పై విరుచుకుపడుతున్న పాక్!

పాక్, అఫ్గాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. <<19249664>>అఫ్గాన్ దాడుల<<>>కు ప్రతీకారంగా పాక్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. ఆపరేషన్ గజబ్-లిల్-హక్ పేరిట ఏకంగా రాజధాని కాబూల్‌పైనే దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కాందహార్, పక్తియాలోని మిలిటరీ బేస్‌లపైనా పాక్ సేన విరుచుకుపడినట్లు తెలుస్తోంది. అనేక ఆర్మీ పోస్టులను ధ్వంసం చేసినట్లు సమాచారం. తాలిబన్ల నెట్‌వర్క్ భారీగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.
News February 27, 2026
ఇవాళ పుట్టపర్తి రావొద్దు: కలెక్టర్

జిల్లాలోని దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం పుట్టపర్తి కలెక్టరేట్లో ప్రతీ నెల 4వ శుక్రవారం నిర్వహించే ప్రత్యేక ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం అనివార్య కారణాల వల్ల తాత్కాలికంగా రద్దు చేశామని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఒక ప్రకటన తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే దివ్యాంగులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. ఫిర్యాదులు సమర్పించడానికి కలెక్టర్ కార్యాలయానికి రావద్దని కోరారు.
News February 27, 2026
బౌలర్లు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి: సూర్య

బ్యాటర్లు అద్భుతంగా రాణించారని, బౌలింగ్ విభాగంలో ఇంకాస్త ‘క్లినికల్’గా ఉండాల్సిందని జింబాబ్వేపై విజయం తర్వాత టీమ్‌ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ అభిప్రాయపడ్డారు. జింబాబ్వే బ్యాటర్ బెన్నెట్ అద్భుతంగా ఆడారని, సండే WI తో మన బౌలర్లు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. కోల్‌కతాలో విండీస్‌తో జరిగే సెమీఫైనల్ బెర్త్ పోరుకు తమ వ్యూహాలను మరింత పకడ్బందీగా సిద్ధం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.


