News May 3, 2024
వైసీపీ విశాఖను దోచుకుంది: బాలకృష్ణ

విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భరత్‌ను గెలిపించాలని సినీ నటుడు, హిందూపూరం ఎమ్మెల్యే అభ్యర్థి బాలకృష్ణ శుక్రవారం సాయంత్రం పిలుపునిచ్చారు. విశాఖ తూర్పులో జరిగిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం విశాఖను దోచుకుందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు ఎన్నికలలో ఎండగడతారని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడం ఖాయమని బాలకృష్ణ ధీమా వ్యక్తం చేశారు.
Similar News
News March 6, 2026
విశాఖ నగరంలో నీటి సరఫరా ఎంతంటే..?

నగరంలో నీటి వినియోగం లభ్యత విషయాలపై జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ సంయుక్తంగా సమావేశం నిర్వహించారు. 24 లక్షల జనాభాకు గత ఏడాది నుంచి 453MLD అవసరం కాగా 390MLD సరఫరా జరుగుతుందని, భవిష్యత్తులో వినియోగం రెండు రెట్లు పెరుగుతుందని తెలిపారు. రీసైక్లింగ్ పద్ధతిలో నీటిని వాడుకునే విధానాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
News March 6, 2026
మార్చి 10 లోపు TIS డేటాను డిక్లరేషన్ అందించాలి: డీఈవో

రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు విశాఖ జిల్లా పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మార్చి 10 లోపు TIS డేటాను డిక్లరేషన్ అందించాలని డీఈవో ప్రేమ్ కుమార్ గురువారం తెలిపారు. 10వ తేదీ తరువాత డిక్లరేషన్ ఫారంలు స్వీకరించరన్నారు.