News May 3, 2024
వామ్మో.. రిచర్డ్ వచ్చేస్తున్నాడు!

ఏ అంపైర్ పేరు చెప్తే భారత క్రికెట్ ఫ్యాన్స్ భయపడతారో? అతను మళ్లీ వచ్చేస్తున్నాడు. అతడే రిచర్డ్ కెటిల్‌బరో. గత తొమ్మిదేళ్లుగా ఐసీసీ ఈవెంట్లలో టీమ్‌ఇండియా ఆడిన అన్ని నాకౌట్ మ్యాచుల్లో రిచర్డ్ అంపైర్‌గా ఉన్నారు. దురదృష్టవశాత్తూ ఆ మ్యాచులన్నింటిలో భారత జట్టు ఓటమి చవి చూసింది. దీంతో అతణ్ని ఐరన్ లెగ్ అంటుంటారు. ఇప్పుడు అతను మళ్లీ టీ20 వరల్డ్ కప్‌లోనూ అంపైర్‌గా వ్యవహరించనుండటం అభిమానుల్ని కలవరపెడుతోంది.
Similar News
News March 22, 2026
ఇండియాలో ఎక్కువ బ్రాంచులు ఉన్న బ్యాంకులు ఇవే

1. SBI- 23,085
2. పంజాబ్ నేషనల్ బ్యాంక్- 10,228
3. కెనరా బ్యాంక్- 9,948
4. HDFC- 9,545
5. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 8,655
6. బ్యాంక్ ఆఫ్ బరోడా- 8,424
7. ICICI- 7,246
8. యాక్సిస్ బ్యాంక్- 5,976
9. ఇండియన్ బ్యాంక్- 5,955 10. బ్యాంక్ ఆఫ్ ఇండియా- 5,375
News March 22, 2026
PSL నుంచి IPLకు శనక

పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL) నుంచి శ్రీలంక T20 కెప్టెన్ దసున్ శనక తప్పుకోనున్నట్లు క్రీడావర్గాలు చెబుతున్నాయి. IPLలో RR తరఫున ఆయన ఆడే అవకాశముందని పేర్కొన్నాయి. గాయంతో దూరమైన సామ్ కరన్‌ను ఆయన రీప్లేస్ చేస్తారని సమాచారం. కాగా శనకను PSL వేలంలో లాహోర్ క్వాలెండర్స్ 2.2కోట్ల(PKR)కు కొనుగోలు చేసింది. ఇక ఆసీస్ ప్లేయర్ మాక్స్‌వెల్ సహా మరికొంతమంది ఆటగాళ్లు PSL నుంచి తప్పుకోనున్నట్లు వార్తలొస్తున్నాయి.
News March 22, 2026
కల్తీ పాలు.. 16కు చేరిన మరణాల సంఖ్య

AP: రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మరణాల సంఖ్య 16కు చేరింది. నెల రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాగేశ్వరావు(72) తాజాగా మృతి చెందారు. కల్తీ పాలు తాగడంతో ఆయన రెండు కిడ్నీలు పాడయ్యాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు కొండబాబు(64) అనే వ్యక్తి మాత్రమే కోలుకున్నారు. పాలను నిల్వ చేసే ఫ్రీజర్‌లో ఇథిలీన్ గ్లైకాల్ <<19323083>>కలవడంతోనే<<>> ఈ ఘోరం జరిగిందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైన విషయం తెలిసిందే.


