News February 27, 2026

TU: M.Ed 3వ సెమిస్టర్ ఫీజు చెల్లింపునకు నేడే ఆఖరు

image

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని M.Ed మూడో సెమిస్టర్ రెగ్యులర్ విద్యార్థులు పరీక్షల ఫీజు చెల్లింపునకు శుక్రవారం చివరి తేదీ అని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య కె.సంపత్ కుమార్ తెలిపారు. సాయంత్రం లోపు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా రూ.1210 ఫీజు చెల్లించవచ్చన్నారు. రూ.100 అపరాధ రుసుంతో మార్చి 2 వరకు అవకాశముందని ఆయన పేర్కొన్నారు. పరీక్షలను మార్చి నెలలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Similar News

News February 28, 2026

ఇరాన్‌తో యుద్ధం.. USకు మద్దతిస్తున్న దేశాలివే!

image

మిడిల్ ఈస్ట్‌లోని సౌదీ అరేబియా, UAE, కువైట్, ఖతర్, బహ్రెయిన్, జోర్డాన్ తమ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను కాపాడుకుంటూ మద్దతిస్తున్నాయి. ఇక వెస్ట్రర్న్ దేశాలైన జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ సైతం ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌ను తీవ్రంగా తప్పుబడుతూ US వైపు నిలుస్తున్నాయి. ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ అమెరికాకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇక ఇరుదేశాలకు మద్దతుపై భారత్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

News February 28, 2026

కన్నడ భాష తెలిసిన పోలీసు సిబ్బందికై లేఖ: SP

image

ఉగాది మహోత్సవాల సందర్భంగా శ్రీశైలంలో విధులు నిర్వర్తించేందుకు కన్నడ భాష తెలిసిన పోలీస్ సిబ్బందిని కర్నూలు జిల్లా నుంచి రప్పించేందుకు ఇప్పటికే లేఖ రాసినట్లు SP సునీల్ షోరాణ్ వెల్లడించారు. శ్రీశైలంలో ఉగాది ఉత్సవాల సందర్భంగా శనివారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో మాట్లాడారు. భక్తుల రద్దీని బట్టి 6వ తేదీ నుంచి వాలంటీర్లను నియమించే అంశంపై చర్చలు జరిపామని, భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.

News February 28, 2026

ఎడపల్లి: క్రీడలు జీవితంలో ఎంతో ముఖ్యం: జిల్లా జడ్జి

image

క్రీడలు మన జీవితంలో ఎంతో ముఖ్యమని NZB జిల్లా జడ్జి భరత లక్ష్మీ అన్నారు. సీపీ XI టీం వర్సెస్ జ్యూడిషియల్ XI టీం జట్ల మధ్య జరిగిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్‌లో జ్యూడిషియల్ టీం విజయం సాధించింది. జడ్జి మాట్లాడుతూ.. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయన్నారు. పోలీస్ శాఖ, న్యాయ విభాగం సభ్యులు నిత్యం ఎంతో బిజీగా విధుల్లో ఉంటూ తమ సమయం కేటాయించి క్రీడల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు.