News May 3, 2024

NZB: ఓటు వేసిన 108 సంవత్సరాల అవ్వ

image

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఓట్ ఫ్రం హోంలో భాగంగా నిజామాబాద్ నగరంలోని హౌసింగ్ బోర్డులోని కేసీఆర్ కాలనీకి చెందిన 108 సంవత్సరాల ఈశ్వరమ్మ శుక్రవారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్ కోసం నియమించిన బృందాలు ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఆమె ఇంటి వద్దనే ఓటింగ్ కంపార్టుమెంట్ ఏర్పాటు చేసి ఓటు గోప్యతకు భంగం లేకుండా ఓటు వేయించారు.

Similar News

News October 1, 2024

ప్రమాదవశాత్తు పోచారం కెనాల్‌లో పడి యువకుడి మృతి

image

నాగిరెడ్డిపేట మండలం గోపాల్పేట గ్రామానికి చెందిన గోరుకుల లక్ష్మణ్ (23) ప్రమాదవశాత్తు పోచారం ప్రధాన కాలువలో కాలుజారి ప్రమాదవశాత్తు పడి మృతి చెందినట్లు ఎస్సై మల్లారెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం లక్ష్మణ్ పోచారం ప్రధాన కాలువలో స్నానం చేసి వస్తానని చెప్పి వెళ్లి తిరిగిరాలేదు. కాగా సోమవారం సాయంత్రం పోచారం ప్రధాన కాల్వలోశవమై కనిపించినట్లు ఎస్ఐ తెలిపారు.

News October 1, 2024

నిజామాబాద్ జిల్లా పీఈటీ టాపర్‌గా రాకేశ్ రెడ్డి

image

సోమవారం వెలువడిన డీఎస్సీ పరీక్ష ఫలితాల్లో నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలంలోని సుద్దపల్లి గ్రామానికి చెందిన ఏరా రాకేశ్ రెడ్డి జిల్లాలో పీఈటీ లో 61.50 మార్కులతో మొదటి ర్యాంకు సాధించాడు. దీంతో అతనిని తల్లిదండ్రులతో పాటు గ్రామస్థులు, యువకులు అభినందించారు. గ్రామీణ ప్రాంతంలో ఉంటూ జిల్లా మొదటి ర్యాంకు సంపాదించడంతో గ్రామస్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

News October 1, 2024

నీట్ పరీక్షల్లో కామారెడ్డి విద్యార్థుల ప్రతిభ

image

ఇటీవల విడుదలైన నీట్ ఫలితాల్లో కామారెడ్డి పట్టణానికి చెందిన చెప్యాల సునైనరెడ్డి రాష్ట్ర స్థాయిలో 272వ ర్యాంకు సాధించి ప్రతిభ కనబరిచింది. అలాగే మరొక విద్యార్థిని సంజన రాష్ట్ర స్థాయిలో 4,148వ ర్యాంకు సాధించి ప్రతిభ కనబరిచింది. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల యాజమాన్యం, పలువురు అభినందించారు.