News May 3, 2024
పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూంలో భద్ర పరచాలి: కలెక్టర్

పోస్టల్ బ్యాలెట్ జాగ్రత్తగా స్ట్రాంగ్ రూం నందు భద్ర పరచాలని కలెక్టర్ మనజీర్ జీలాని సమూన్ అన్నారు. ఎన్నికల సామగ్రి పోలింగ్ ముందు రోజు డిస్ట్రిబ్యూషన్, పోల్ అయ్యాక రిసెప్షన్ సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు, పర్యవేక్షణ 24X7 ఉండాలని అన్నారు. పోలింగ్ కి 72 గం.ల ముందు నగదు, మద్యం, ఉచితాల పంపిణీ వంటివి జరగకుండా పటిష్ఠ నిఘా ఉండాలని అధికారులకు సూచించారు.
Similar News
News January 15, 2026
సంక్రాంతి వేళ..శ్రీకాకుళంలో జరిగే జాతరలివే?

రైతుల కష్టానికి ప్రతీకగా సంక్రాంతి పండగను ఏటా ధనుర్మాసంలో జరుపుకుంటారు. మనకు అన్నీ సమకూర్చే భూమాతకు కృతజ్ఞతగా నేడు ఇళ్ల ముంగిట మహిళలు రంగవల్లులు వేస్తారు. శాస్త్రీయంగా, సైన్స్ ప్రకారం సూర్య గమనం నేటి నుంచి మారుతోంది. ఈ పండగ వేళ శ్రీకాకుళం జిల్లాలో జరిగే జాతరలివే:
✯ ఇచ్ఛాపురం: శివానందగిరిపై త్రినాథ్ స్వామి యాత్ర
✯ పలాస: డేకురుకొండ జాతర
✯ ఆమదాలవలస: సంగమయ్య కొండ జాతర
News January 15, 2026
ఎస్పీ కార్యాలయంలో త్రిపురనేని రామస్వామి చౌదరి జయంతి వేడుకలు

కవిరాజు, ప్రముఖ సాహిత్య, సామాజిక వేత్త త్రిపురనేని రామస్వామి చౌదరి జయంతి వేడుకలు గురువారం శ్రీకాకుళం పోలీస్ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లా అధనపు ఎస్పీ శ్రీనివాసరావు రామస్వామి చౌదరి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజంలో మూఢనమ్మకాలు కుల వివక్షత అసమానతలపై ఆయన నిర్భయంగా పోరాటం చేశారన్నారు. మానవతా విలువలు చాటి చెప్పారన్నారు.
News January 15, 2026
శ్రీకాకుళం: బస్సుల్లో టికెట్ల ధర అధికంగా వసూలు చేస్తున్నారా?

శ్రీకాకుళం జిల్లాకు వస్తున్న ప్రైవేట్ బస్సులు, ఇతర ప్రాంతాలకు వెళుతున్న బస్సులను విస్తృతంగా తనిఖీ చేస్తున్నట్లు జిల్లా ఉప రవాణా శాఖ అధికారి విజయ సారథి చెప్పారు. ఆర్టీజీఎస్ యాప్ సహకారంతో పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. ఈ నెల 18వ తేదీ వరకు తనిఖీలు సాగుతాయని వెల్లడించారు. అధిక ఛార్జీల వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టామని, అలా చేస్తే హెల్ప్ లైన్ నంబర్ 9281607001 కు సంప్రదించాలన్నారు.


