News February 27, 2026
విశాఖ: సైబర్ నేరాలకు అడ్డాగా మ్యూల్ ఖాతాలు

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి ఏజెంట్లు కమీషన్ ఆశ చూపించి వారి పేర్లపై మ్యూల్ ఖాతాలు తెరిపిస్తున్నారు. ఈ ఖాతాల ద్వారానే సైబర్ నేరగాళ్లు దోచుకున్న డబ్బును షెల్ కంపెనీలకు మళ్లించి విదేశాలకు తరలిస్తున్నారు. బాధితులు ఆలస్యంగా ఫిర్యాదు చేస్తే నిధుల రికవరీ కష్టమవుతోంది. మ్యూల్ ఖాతాలు సరఫరా చేసిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఏడాది కాలంలో రాష్ట్రంలో 400 మంది అకౌంట్‌దారులను అరెస్టు చేశారు.
Similar News
News March 3, 2026
జగిత్యాల జిల్లాలో వినూత్న హోలీ వేడుకలు

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం భూపతిపూర్‌లో హోలీ పండుగను చిన్నారులు వినూత్నంగా జరుపుకున్నారు. శరీరాలపై రంగులు పూసుకుని గ్రామ వీధుల్లో సందడి చేశారు. చేతిలో UPI స్కానర్ పట్టుకుని డిజిటల్ విరాళాలు స్వీకరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నగదు మాత్రమే కాకుండా ఆన్‌లైన్ చెల్లింపులు కూడా స్వీకరించారు. సంప్రదాయం–సాంకేతికత కలయికతో పండుగ ఉత్సాహంగా, సంతోషంగా సాగింది.
News March 3, 2026
NGKL: మార్చి నెల ‘సదరం’ శిబిరాల షెడ్యూల్ విడుదల

కందనూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చి నెల సదరం శిబిరాల తేదీలను డీఆర్‌డీవో చిన్న ఓబులేసు ప్రకటించారు. శారీరక దివ్యాంగులకు 6, 10, 13, 17, 20, 24, 31 తేదీల్లో, వినికిడి లోపానికి 5, 25, కంటిచూపు లోపానికి 09, 24, మానసిక వైకల్యానికి 11, 18, తలసేమియా బాధితులకు 30న శిబిరాలు నిర్వహిస్తారు.
News March 3, 2026
భారత్ చేరుకున్న పీవీ సింధు

యుద్ధం వల్ల దుబాయ్‌లో చిక్కుకున్న పీవీ సింధు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. ఇవాళ తెల్లవారుజామున ఆమె బెంగళూరు ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యారు. సింధుతో పాటు మరికొంత మంది ప్రయాణికులు స్వస్థలాలకు చేరుకోవడంతో వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. తిరిగి స్వదేశానికి చేరుకోవడం ఆనందంగా ఉందని సింధు ట్వీట్ చేశారు. ఇందుకు సహకరించిన UAE అధికారులు, ఎయిర్‌పోర్ట్ సిబ్బందికి థాంక్స్ చెప్పారు.


