News February 27, 2026
తుని: ఐదేళ్లు.. ముగ్గురు మహిళలు

తుని మున్సిపాలిటీ ఐదేళ్ల పాలనలో ముగ్గురు ఛైర్ పర్సన్లు బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఛైర్ పర్సన్‌గా ఉన్న నార్ల భువన సుందరి పదవీకాలం మార్చి 17తో ముగియనుంది. 2021లో YCP నుంచి ఏలూరి సుధారాణి బాధ్యతలు చేపట్టగా, 2025లో రాజీనామా చేశారు. అనంతరం కుచ్చర్లపాటి రూపాదేవి ఆ బాధ్యతలు చేపట్టారు. తదుపరి భువన సుందరి చైర్ పర్సన్‌గా ఎంపికై పదవీకాలాన్ని పూర్తి చేస్తున్నారు.
Similar News
News March 1, 2026
చిత్తూరు: HPV వ్యాక్సిన్‌పై అవగాహన

సర్వైకల్ క్యాన్సర్ వ్యాపించకుండా 14 ఏళ్లలోపు బాలికలకు ఉచిత HPV వ్యాక్సిన్ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా దీనిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో నిర్వహిస్తున్న సర్వేలో 4185 మంది క్యాన్సర్ అనుమానితులను గుర్తించారు. ఈ వ్యాక్సిన్ 18,500 మంది బాలికలకు అందించాల్సి ఉందని అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు.
News March 1, 2026
చిత్తూరు: చెత్త ఇస్తే డబ్బులు.. ఎంతో తెలుసా.?

పారిశుద్ధ్య కార్యక్రమాలలో భాగంగా ప్రభుత్వం ఇటీవల స్వచ్ఛ రథాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం నెలలో ఒకరోజు పంచాయతీల పరిధిలో ఈ వాహనం పర్యటిస్తుందని అధికారులు తెలుపుతున్నారు. వాహనాలకు అందజేస్తే పాత ఇనుముకు కేజీ రూ. 20, అల్యూమినియం రూ. 120, స్టీల్ రూ.40, పేపర్లు రూ.15, పుస్తకాలు, అట్టపెట్టెలు రూ.10, ప్లాస్టిక్ రూ.20 చొప్పున చెల్లిస్తారని పేర్కొంటున్నారు.
News March 1, 2026
కడప జిల్లాలో రోజుకు రూ.3 కోట్ల మద్యం తాగేశారు

కడప జిల్లాలో గత నెలలో రోజుకు రూ.3.30 కోట్ల మద్యం తాగేశారు. ఫిబ్రవరి నెలలో 28 రోజుల్లో రూ.92.67 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. సర్కిల్ వారీగా రూ.కోట్లలో వివరాలు ఇలా ఉన్నాయి. కడప-24.85, సిద్దవటం-3, బద్వేల్-10.13, జమ్మలమడుగు-7.23, ముద్దనూరు రూ-3.77, మైదుకూరు-9, ప్రొద్దుటూరు-16.40, పులివెందుల-10.68, ఎర్రగుంట్ల-7.58. ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు, గంటకు రూ.28 లక్షల మద్యం తాగేశారు.


