News May 3, 2024

బస్ టికెట్లు బుక్ చేసుకునే వారికి GOOD NEWS

image

TS: ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ ఆఫర్ ప్రకటించింది. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు రిజర్వేషన్ ఛార్జీల నుంచి మినహాయింపు ఇస్తోంది. ప్రయాణానికి 8 రోజుల ముందు రిజర్వేషన్ చేసుకునే వారికి ఈ మినహాయింపు వర్తిస్తుందని సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. ముందస్తు రిజర్వేషన్ కోసం http://tsrtconline.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

Similar News

News November 6, 2025

వరల్డ్ క్లాస్ బ్యాంకుల కోసం చర్చలు: నిర్మల

image

భారత్‌కు అతిపెద్ద, వరల్డ్ క్లాస్ బ్యాంకుల అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆ దిశగా ప్రభుత్వం ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టిందన్నారు. ఆర్బీఐతోపాటు బ్యాంకులతోనూ చర్చిస్తున్నామని ముంబైలో జరిగిన 12th SBI బ్యాంకింగ్&ఎకనామిక్స్ కాంక్లేవ్‌లో తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనపై ప్రధానంగా దృష్టిసారించామని, పదేళ్లలో మూలధన వ్యయం 5 రెట్లు పెరిగిందని పేర్కొన్నారు.

News November 6, 2025

మామిడికి బోరాన్ ఎలా అందిస్తే మంచిది?

image

బోరాన్‌ను మామిడి మొక్క/చెట్లపై పిచికారీ చేసినప్పుడు లేత, మృదువైన మొక్క బాగాలు, ఆకులు, రెమ్మలు, పూత బాగా పీల్చుకుంటాయి. అంటే చెట్లలో కొత్త చిగుర్లు వచ్చినప్పుడు పూ మొగ్గలు, పూత, లేత పిందెల సమయంలో చెట్లపై బోరాన్ పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. చెట్లలో ముదురు ఆకులు ఉన్నప్పుడు, చెట్లు నిద్రావస్థలో ఉన్నప్పుడు (అక్టోబర్-నవంబర్) బోరాన్‌ను భూమికి వేసుకోవడం మంచిదని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.

News November 6, 2025

నైట్ స్కిన్ కేర్ ఇలా..

image

పగలంతా అలసిపోయిన చర్మం రాత్రివేళ తనని తాను రిపేర్ చేసుకుంటుంది. ఏదైనా స్కిన్ ట్రీట్మెంట్ చెయ్యాలన్నా ఇదే సరైన సమయం. ఇందుకోసం యాంటీఆక్సిడెంట్స్ ఉన్న నైట్ క్రీమ్ అప్లై చేయాలి. ఇవి వయసుని పెంచే ఫ్రీరాడికల్స్‌తో పోరాడతాయి. కళ్ల కింద ఉబ్బు వస్తుంటే కెఫీన్ ఉన్న ఐక్రీమ్స్ అప్లై చెయ్యాలి. వాజిలీన్/ కొబ్బరి నూనెను చేతులకు, పాదాలకు అప్లై చేసి గ్లౌవ్స్, సాక్స్ వేసుకుని పడుకుంటే ఉదయానికి మృదువుగా మారతాయి.