News February 27, 2026

విజయవాడలో ప్రియుడిని పట్టింటిన గర్ల్‌ఫ్రెండ్ ఫోన్‌కాల్..!

image

పోలీసుల కళ్లు కప్పి పరారైన నిందితుడిని ఎట్టకేలకు మాచవరం పోలీసులు అరెస్ట్ చేశారు. డిసెంబర్‌లో డ్రగ్స్ తీసుకుంటున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా నిందితుడు రాజేష్ పోలీసుల నుంచి పరారయ్యాడు. రాజేష్‌కు గర్ల్ ఫ్రెండ్ ఉండగా ఆమెతో వేరే వారి ఫోన్ నుంచి నిందితుడు ఇన్‌స్టాగ్రామ్‌లో మాట్లాడుతుండగా సాంకేతిక పరిజ్ఞానంతో అతణ్ని అదుపులోకి తీసుకొని గురువారం రిమాండ్‌కు తరలించారు.

Similar News

News February 28, 2026

విశాఖ: కేంద్ర కారాగారాన్ని సందర్శించిన జైళ్ల శాఖ ఐజీ

image

విశాఖ కేంద్ర కారాగారాన్ని జైళ్ల శాఖ ఐజీ ఇండ్ల శ్రీనివాసరావు సందర్శిచారు. ఏపీ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ బిల్లు-2026 అసెంబ్లీలో ప్రవేశపెట్టామని, గవర్నర్ ఆమోదం వెంటనే చట్టమవుతుందని తెలిపారు. జైళ్ల అభివృద్ధికి రూ.102 కోట్లు కేటాయించి, తొలి విడతగా రూ.53 కోట్లతో బ్యారక్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మూడు రోజుల శిక్షణ ముగింపులో అధికారులకు సర్టిఫికెట్లు అందజేశారు.

News February 28, 2026

భద్రకాళి అమ్మవారికి విశేష పూజలు

image

చారిత్రక భద్రకాళి ఆలయంలో ఉత్తరాయణం శుక్లపక్షం సందర్భంగా అర్చకుడు శేషు ఆధ్వర్యంలో విశేష పూజలు చేశారు. అమ్మవారికి సుప్రభాత సేవ, నిత్యార్చన, షోడశోపచార పూజలు చేసి అమ్మవారిని అలంకరించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు క్యూలైన్లలో వేచి ఉండి దర్శనం చేసుకున్నారు. ఆలయ పరిసరాలు భక్తుల రాకతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.

News February 28, 2026

అరుణాచలం వెళ్లే భక్తులకు శుభవార్త

image

TG: హైదరాబాద్ నుంచి అరుణాచలం(తిరువణ్ణామలై)కు వెళ్లే భక్తులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. నాంపల్లి-కన్యాకుమారి(07229/07230) వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను ఇకపై రెగ్యులర్‌(17069/17070) సర్వీస్‌గా నడపనున్నట్లు తెలిపింది. అలాగే కాచిగూడ-మధురై వీక్లీ ఎక్స్‌ప్రెస్‌(17615/17616)ను కూడా రోజూ నడుపుతామని పేర్కొంది. దీన్ని తూత్తుకుడి వరకు పొడిగించింది.