News February 27, 2026

అష్టలక్ష్మి: విద్యాలక్ష్మి దేవిని ఎలా పూజించాలంటే?

image

విద్యాలక్ష్మి దేవికి తెల్లటి వస్త్రాలు, పూలతో పూజ చేయాలని పండితులు సూచిస్తున్నారు. ‘విద్యాలక్ష్మి చదువుకు, వివేకానికి అధిదేవత. తెలుపు రంగు సరస్వతీ దేవికి ఇష్టమైనది. ఇది అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానోదయం కలిగిస్తుంది. విద్యార్థులు దేవిని పూజిస్తే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. శాస్త్ర విజ్ఞానం, కళలు, సంగీతంలో ప్రావీణ్యం సంపాదించాలని అనుకునేవారికి ఈ పూజ శ్రేయస్కరమైనది’ అని చెబుతున్నారు.

Similar News

News February 28, 2026

కాకినాడ విషాదం.. ఒక్కొక్కరికి రూ.20లక్షల చొప్పున పరిహారం

image

AP: కాకినాడ(D) వేట్లపాలెంలో జరిగిన భారీ <<19263594>>పేలుడు<<>> ఘటనలో 20 మంది మృతిచెందడంపై CM చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.20లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామని చెప్పారు. బాధ్యులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని వేట్లపాలెంలో బాధితులను పరామర్శించిన అనంతరం తెలిపారు.

News February 28, 2026

డూ ఆర్ డై మ్యాచ్.. ఫర్హాన్ సెంచరీ

image

T20WC: సెమీస్ చేరాలంటే భారీ మార్జిన్‌‌తో గెలవాల్సిన మ్యాచులో పాకిస్థాన్ బ్యాటర్లు శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఓపెనర్లు ఫర్హాన్, ఫఖర్ జమాన్(84) పోటాపోటీగా బౌండరీలు బాదారు. ఈ క్రమంలో ఫర్హాన్ 59 బంతుల్లో సెంచరీ బాదారు. తన ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 5 సిక్సులున్నాయి. మరోవైపు చివర్లో 11 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోవడంతో పాక్ 212/8కి పరిమితమైంది.

News February 28, 2026

హార్ముజ్ నుంచి రవాణా బంద్

image

ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ఇతర దేశాల చావుకొచ్చింది. హార్ముజ్ జలసంధి నుంచి రవాణా ఆపేస్తున్నట్లు పలు మేజర్ ముడిచమురు, ఇంధన, నేచురల్ గ్యాస్ కంపెనీలు ప్రకటించినట్లు రాయిటర్స్ తెలిపింది. కొన్నిరోజులు తమ ఓడలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. 30% రవాణా ఈ జలసంధి నుంచే అవుతుండగా ప్రస్తుత పరిణామాలతో వాటి ధరలు భారీగా పెరిగే అవకాశముంది. ఈ ప్రభావం INDపైనా పడనుంది. ఇప్పటికే Gold, Silver ధరలు పెరుగుతున్నాయి.