News February 27, 2026

సిద్దిపేట: మార్చి 1న ప్రవేశ పరీక్ష

image

టీజీ ఎస్సీ స్టడీ సర్కిల్‌లో వివిధ పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సిద్దిపేట జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి హమీద్ తెలిపారు. అభ్యర్థులు హల్ టికెట్స్‌ని tsstudycircle.co.inలో డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపారు. మార్చి 1న స్థానిక ప్రతిభ డిగ్రీ కళాశాలలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 వరకు పరీక్ష ఉంటుందన్నారు.

Similar News

News March 1, 2026

చిత్తూరు: చెత్త ఇస్తే డబ్బులు.. ఎంతో తెలుసా.?

image

పారిశుద్ధ్య కార్యక్రమాలలో భాగంగా ప్రభుత్వం ఇటీవల స్వచ్ఛ రథాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం నెలలో ఒకరోజు పంచాయతీల పరిధిలో ఈ వాహనం పర్యటిస్తుందని అధికారులు తెలుపుతున్నారు. వాహనాలకు అందజేస్తే పాత ఇనుముకు కేజీ రూ. 20, అల్యూమినియం రూ. 120, స్టీల్ రూ.40, పేపర్లు రూ.15, పుస్తకాలు, అట్టపెట్టెలు రూ.10, ప్లాస్టిక్ రూ.20 చొప్పున చెల్లిస్తారని పేర్కొంటున్నారు.

News March 1, 2026

కడప జిల్లాలో రోజుకు రూ.3 కోట్ల మద్యం తాగేశారు

image

కడప జిల్లాలో గత నెలలో రోజుకు రూ.3.30 కోట్ల మద్యం తాగేశారు. ఫిబ్రవరి నెలలో 28 రోజుల్లో రూ.92.67 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. సర్కిల్ వారీగా రూ.కోట్లలో వివరాలు ఇలా ఉన్నాయి. కడప-24.85, సిద్దవటం-3, బద్వేల్-10.13, జమ్మలమడుగు-7.23, ముద్దనూరు రూ-3.77, మైదుకూరు-9, ప్రొద్దుటూరు-16.40, పులివెందుల-10.68, ఎర్రగుంట్ల-7.58. ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు, గంటకు రూ.28 లక్షల మద్యం తాగేశారు.

News March 1, 2026

త్వరలోనే 10గ్రాముల బంగారం రూ.2లక్షలు?

image

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలపై పెను ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర ₹1,70,000 <<19269997>>మార్కును<<>> దాటింది. ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగి, ఇరు దేశాల మధ్య దాడులు తీవ్రమైతే అతి త్వరలోనే ఇది ₹2,00,000 మార్కును చేరుకోవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం, వెండిని ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించడమే ఇందుకు కారణం.