News February 27, 2026
విశాఖలో యాక్సిడెంట్.. ఒకరి మృతి

విశాఖ నగరంలో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. అక్కిరెడ్డిపాలేనికి చెందిన తలాడ గోపాలరావు స్కూటీపై బీహెచ్‌పీ వైపు బయల్దేరారు. మార్గమధ్యంలో జీవీఎంసీ చెత్త లారీ వెనుక నుంచి స్కూటీని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన గోపాలరావు అక్కడికక్కడే మృతి చెందారు. గాజువాక ట్రాఫిక్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు
Similar News
News March 5, 2026
బాలీవుడ్ మూవీలా పశ్చిమాసియా పాలిటిక్స్!

పశ్చిమాసియా జియో పాలిటిక్స్ బాలీవుడ్ మూవీలా కనిపిస్తున్నాయంటూ <<18418395>>హర్ష్ గోయెంకా<<>> ట్వీట్ చేశారు. ‘‘ఇజ్రాయెల్ వెంట IND ఉంది. USతో ఇజ్రాయెల్, పాక్‌తో US, ఇరాన్ వెంట PAK ఉంది. అయితే IND-PAK శత్రువులుగానే ఉన్నాయి. ఇది ‘ముఖద్దర్ కా సికందర్’ మూవీని గుర్తు చేస్తోంది. రేఖను అంజాద్ ప్రేమిస్తారు. అమితాబ్‌ను రేఖ, రాఖీని అమితాబ్, వినోద్‌ను రాఖీ లవ్ చేస్తారు. అయితే అంజాద్, అమితాబ్ శత్రువులే’’ అని పేర్కొన్నారు.
News March 5, 2026
మాక్‌డ్రిల్‌లో పాల్గొన్న సిబ్బందిని అభినందించిన కలెక్టర్, ఎస్పీ

జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాల్లో భద్రతా వ్యవస్థలను పరీక్షించేందుకు మార్చి 3 నుంచి 5 వరకు ప్రత్యేక మాక్ డ్రిల్ నిర్వహించారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జీ), ఆక్టోపస్, జిల్లా పరిపాలన, పోలీసు శాఖల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ మాక్ డ్రిల్‌లో పాల్గొన్న సిబ్బంది, అధికారులను కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు అభినందించారు.
News March 5, 2026
NZB: కారు బోల్తా.. ఇద్దరు మృతి

నిజామాబాద్ బైపాస్ రోడ్డుపై గురువారం కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా ఆరుగురికి గాయాలయ్యాయి. మృతులను MHకు చెందిన శోభ వాగ్మారే(42), సత్వ తుకారం వాగ్మారే(45)గా గుర్తించారు. దోమకొండకు చెందిన చింతల శ్రీనివాస్, అనిత, సాహెబ్ రావు, నాగారం సాయిలు, బాలాజీ సత్వ వాగ్మరేతో పాటు డ్రైవర్ సీతారాం శ్రీరామ్‌కు గాయాలయ్యాయి. డిచ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


