News February 27, 2026
విశ్రవసుడి గురించి మీకు తెలుసా?

విశ్రవసుడు గొప్ప వేద పండితుడు, తపశ్శాలి. పులస్త్యుని కుమారుడైన ఈయనకు అమిత శక్తి ఉంది. ఈయన మొదటి భార్య ఇలవిడ. వీరి సంతానమే కుబేరుడు. విశ్రవసుడి తపస్సుకు మెచ్చి సుమాలి తన కుమార్తె కైకసిని ఇచ్చి వివాహం చేశాడు. వీరి ద్వారా రావణ, కుంభకర్ణ, విభీషణ, శూర్పణఖ జన్మించారు. రావణుడు తన తండ్రి మాటను కాదని, కుబేరుడిని లంక నుంచి వెళ్లగొట్టడంతో విశ్రవసుడు తీవ్ర మనస్తాపానికి గురై వారిని విడిచిపెట్టి వెళ్లిపోయాడు.
Similar News
News March 2, 2026
అల్లు ఇంట ‘విరోష్’ జంట సందడి

పెళ్లి తర్వాత విజయ్-రష్మిక బిజీబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే PM మోదీ, CM రేవంత్‌ను కలిసిన ఈ కొత్త జంట తాజాగా అల్లు ఇంట సందడి చేసింది. ఈ నెల 6న అల్లు శిరీష్ వివాహం జరగనున్న నేపథ్యంలో నిన్న పెళ్లి కొడుకు వేడుక జరిగింది. దీనికి ‘విరోష్’ జోడీ హాజరైంది. వారిద్దరికీ అల్లు అరవింద్, అర్జున్ సహా కుటుంబ సభ్యులు విషెస్ తెలిపారు. కాగా ఇవాళ అల్లు స్టూడియోస్‌లో శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుంది.
News March 2, 2026
చంద్రగ్రహణం.. రేపు ఆలయాలు మూసివేత

తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు అన్నీ రేపు చంద్రగ్రహణం కారణంగా మూతపడనున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయ దర్శనాలను ఉదయం 9 నుంచి రాత్రి 7.30 వరకు నిలిపివేస్తారు. మరోవైపు TGలోని యాదగిరిగుట్ట ఆలయాన్ని ఉదయం 7కే మూసివేస్తామని తిరిగి బుధవారం తెరవనున్నట్లు యాజమాన్యం వెల్లడించింది. రేపు నిర్వహించాల్సిన హోలికోత్సవాన్ని ఈరోజు సాయంత్రం నిర్వహించనున్నట్లు తెలిపింది. అయితే శ్రీకాళహస్తి ఆలయం మాత్రం రేపు తెరిచే ఉంటుంది.
News March 2, 2026
ఇవాళ తెలంగాణకు రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ TGలో పర్యటించనున్నారు. ఉ.9.30 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. వికారాబాద్(D) అనంతగిరిలో జరుగుతున్న DCC అధ్యక్షుల శిక్షణా కార్యక్రమానికి హాజరై దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ బలోపేతం, రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సూచనలు చేయనున్నారు. AP, TG కాంగ్రెస్ ముఖ్య నేతలతోనూ భేటీ కానున్నారు. ఇటీవల లొంగిపోయిన మావోయిస్టులనూ రాహుల్ కలిసే అవకాశం ఉంది.


