News February 27, 2026
మార్చి 2 నుంచి ఆరోగ్య పరీక్షలు

TG ప్రభుత్వం మార్చి 2 నుంచి జూన్ 9 వరకు(100D) ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమాన్ని అమలు చేయనుంది. తొలిదశ(మార్చి 2-31)లో గర్భిణులు, తల్లీశిశువులు, వృద్ధుల సేవలకు ప్రాధాన్యం ఇస్తారు. స్కూళ్లు, అంగన్వాడీల్లో శిబిరాలు నిర్వహిస్తారు. రెండో దశ(APR 1-15)లో దీర్ఘకాలిక వ్యాధులు, మూడో దశ(APR 16- మే15)లో వేసవి ఆరోగ్య సమస్యలపై చర్యలు తీసుకుంటారు. నాలుగో దశ(మే 16-జూన్ 9)లో ప్రైమరీ హెల్త్ సెంటర్లను బలోపేతం చేస్తారు.
Similar News
News March 2, 2026
అభిషేక్‌ను పక్కన పెట్టాల్సిందేనా?

T20 WCలో భారత అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఓపెనర్ అభిషేక్ శర్మ ఆటతీరు అస్సలు మారడం లేదు. ‘ఈ మ్యాచులో తప్పకుండా ఆడతాడు’ అని అనుకోవడం తప్ప అభి బ్యాట్ నుంచి పరుగుల ప్రవాహమే లేదు. ఇప్పటివరకు 6 మ్యాచుల్లో 80 రన్స్ మాత్రమే చేశారు. 3సార్లు డకౌట్ అయ్యారు. సూపర్-8లో జింబాబ్వేపై 55రన్స్ చేసి మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడనుకునేలోపే నిన్న విండీస్‌పై 10పరుగులకే వెనుదిరిగారు. అతడిని పక్కనపెట్టే టైమొచ్చిందా?
News March 2, 2026
నిద్రలేవగానే కాళ్లు, చేతులూ వణుకుతున్నాయా?

నిద్రలేవగానే కొందరికి శరీరంలోని కండరాలు.. ముఖ్యంగా చేతులు, కాళ్లు వణికినట్టు అనిపిస్తుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ పడిపోయినా, అతిగా కెఫిన్ (కాఫీ/టీ) తీసుకుంటున్నా, ఆందోళన/ఒత్తిడి ఎక్కువైనా, డీహైడ్రేషన్‌కు గురైనా ఇలా అనిపిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ లక్షణం కనిపిస్తే జాగ్రత్తలు తీసుకోవాలని.. అవసరమైతే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. సరిపడా నిద్రలేకపోయినా ఇలా అవుతుందని చెబుతున్నారు.
News March 2, 2026
అల్లు ఇంట ‘విరోష్’ జంట సందడి

పెళ్లి తర్వాత విజయ్-రష్మిక బిజీబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే PM మోదీ, CM రేవంత్‌ను కలిసిన ఈ కొత్త జంట తాజాగా అల్లు ఇంట సందడి చేసింది. ఈ నెల 6న అల్లు శిరీష్ వివాహం జరగనున్న నేపథ్యంలో నిన్న పెళ్లి కొడుకు వేడుక జరిగింది. దీనికి ‘విరోష్’ జోడీ హాజరైంది. వారిద్దరికీ అల్లు అరవింద్, అర్జున్ సహా కుటుంబ సభ్యులు విషెస్ తెలిపారు. కాగా ఇవాళ అల్లు స్టూడియోస్‌లో శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుంది.


