News February 27, 2026
VZM: భార్య మందలించడంతో భర్త ఆత్మహత్య

విజయనగరం మండలం కోరుకొండపాలెంకు చెందిన వెంకటసత్యం అనే వ్యక్తి మద్యానికి బానిసైయ్యారు. ఈ క్రమంలో నిత్యం తాగితే పాప, తాను బతకడం ఎలా అంటూ భార్య నిలదీయడంతో మనస్తాపానికి గురైయ్యాడు. దీంతో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 4, 2026
NTR: రూ.38.83 లక్షల విలువైన గంజాయి స్వాధీనం

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రయాణికుల భద్రత కోసం రైల్వే రక్షణ దళం చేపట్టిన ప్రత్యేక చర్యల్లో కీలక ఫలితాలు సాధించినట్లు చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఎ.శ్రీధర్ తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో ఆపరేషన్ నార్కోస్ కింద రూ.38.83 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. 11 మందిని అరెస్టు చేసి, అధికారులకు అప్పగించామన్నారు. ఆపరేషన్ సతర్క్‌లో భాగంగా రూ.1,65,505ల విలువైన మద్యాన్ని సీజ్ చేశామన్నారు.
News March 4, 2026
రానున్నాయ్ మహిళా పెట్రోల్ బంకులు

TG: ప్రతి జిల్లాలో మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు ఏర్పాటు కానున్నాయి. ‘ఇందిరా మహిళాశక్తి’ కింద వీటిని నెలకొల్పుతారు. జిల్లా యంత్రాంగం ఈ పెట్రోలు బంకులకు అవసరమైన భూమిని 30 ఏళ్ల లీజుకు కేటాయిస్తూ ప్రతిపాదనల్ని మెప్మాకు అందించాలి. ALF, TLFలు వీటికి నిధులు సమకూరుస్తాయి. ఆయిల్ కంపెనీలు, లీగల్ మెట్రాలజీ ఇలా వివిధ ప్రొసీజర్లు పూర్తి చేయాలి. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే దీని లక్ష్యం.
News March 4, 2026
వేములవాడ: నేడే అసలైన హోలీ

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలో హోలీ వేడుకలను బుధవారం జరుపుకోనున్నారు. ఫాల్గుణ పౌర్ణిమ రోజున హోలీ వేడుకలు జరుపుకోవాల్సి ఉండగా, కేతుగ్రస్త చంద్రగ్రహణం కారణంగా 4వ తేదీ (బుధవారం) హోలీ జరుపుకోవాలని పండితులు సూచించారు. ఈ మేరకు బుధవారం వేములవాడతో పాటు అనేక ప్రాంతాల్లో హోలీ జరుపుకోనున్నారు. ప్రభుత్వ సెలవు కారణంగా కొన్ని ప్రాంతాల్లో మంగళవారం హోలీ జరుపుకున్నారు.


