News February 27, 2026
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్‌కు క్లీన్‌చిట్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బిగ్ రిలీఫ్ లభించింది. కేసులో ఆయనతో పాటు మాజీ మంత్రి మనీశ్ సిసోడియాను డిశ్ఛార్జ్ చేస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అభియోగాలపై ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది.
Similar News
News February 28, 2026
ఆదిలాబాద్: ఇంగ్లిష్ పరీక్షకు 364 మంది గైర్హాజరు

జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. శనివారం నిర్వహించిన ఆంగ్ల పరీక్ష సజావుగా ముగిసిందని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (DIEO) జాదవ్ గణేష్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 8,622 మంది విద్యార్థులకు గాను 8,258 మంది పరీక్షకు హాజరయ్యారని, 364 మంది గైర్హాజరైనట్లు వివరించారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠమైన నిఘా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
News February 28, 2026
MVRCలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

ముంబై రైల్వే వికాస్ కార్పొరేషన్ లిమిటెడ్(MVRC)లో 10 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో BE/BTech, ME/MTech ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. స్క్రీనింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://mrvc.indianrailways.gov.in
News February 28, 2026
క్యూబాను స్నేహపూర్వకంగా స్వాధీనం చేసుకుంటాం: ట్రంప్

వెనిజులా అధ్యక్షుడు మదురో అరెస్ట్, గ్రీన్‌లాండ్‌పై బెదిరింపుల తర్వాత US అధ్యక్షుడు ట్రంప్ కన్ను క్యూబాపై పడింది. ఆ దేశాన్ని స్నేహపూర్వకంగా స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. విదేశాంగ కార్యదర్శి రూబియో ఆ దేశ నాయకులతో చర్చలు జరుపుతున్నారన్నారు. ‘నేను చిన్నప్పటి నుంచి క్యూబా గురించి వింటున్నా. అదొక విఫల దేశం. డబ్బుల్లేక తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. వారు మా సాయం కోరుకుంటున్నారు’ అని చెప్పారు.


