News February 27, 2026

చిత్తూరు జిల్లా వన్‌స్టాప్ సెంటర్‌లో ఉద్యోగాలు

image

చిత్తూరు జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ సంస్థ వన్ స్టాప్ సెంటర్‌లో 14 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల మహిళలు నేటి నుంచి మార్చి 9 వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి పీజీ, డిగ్రీ(లా, సోషల్ వర్క్, సోషల్ సైన్స్, సైకాలజీ), LLB, పారా మెడికల్ డిగ్రీ/డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 25 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్‌సైట్: https://chittoor.ap.gov.in/

Similar News

News March 2, 2026

తెలుగు సినిమాకి తెలుగులో టైటిల్ ఏది?

image

తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తమిళ హీరో సూర్య నటిస్తున్న సినిమాకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ అనే టైటిల్ ఖరారైంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ మూవీ టీమ్ రిలీజ్ చేసిన పోస్టర్లపై విమర్శలొస్తున్నాయి. మూవీ టీమ్ తమిళం, ఇంగ్లిష్‌లోనే పోస్టర్లు రిలీజ్ చేసింది. తెలుగులో టైటిల్ పోస్టర్ ఇవ్వలేదు. దీంతో తెలుగు టైటిల్ ఎందుకు లేదు? తెలుగంటే నిర్లక్ష్యం ఎందుకు? అంటూ తెలుగు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

News March 2, 2026

22,195 పోస్టులు.. దరఖాస్తు గడువు పెంపు

image

<>రైల్వేలో<<>> 22,195 గ్రూప్ డీ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళ ఆఖరు తేదీ కాగా.. ఫిబ్రవరి 9 వరకు పొడిగించారు. టెన్త్, ఐటీఐ అర్హత గలవారు ఇప్పటివరకు అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 33ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు జీతం రూ.18వేలు చెల్లిస్తారు. CBT, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, DV, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. సైట్: https://www.rrbcdg.gov.in/

News March 2, 2026

ఇరాన్‌లో ఎంత మంది చనిపోయారంటే..

image

మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న యుద్ధం మారణహోమమే సృష్టిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేస్తున్న దాడుల కారణంగా ఇరాన్‌లో ఇప్పటి వరకు 555 మంది మరణించినట్లు ఆ దేశంలోని రెడ్ క్రెసెంట్ సంస్థ ప్రకటించింది. మొత్తం 131 నివాసాలను టార్గెట్ చేసినట్లు వెల్లడించింది. గాయపడిన వారి వివరాలను మాత్రం చెప్పలేదు. శనివారం ప్రకటించిన సమాచారం ప్రకారం.. 201 మంది చనిపోగా, 747 మంది గాయపడ్డారు.