News February 27, 2026
భద్రాద్రిలో వైభవంగా నిత్య కళ్యాణం

భద్రాద్రి రామాలయంలో శుక్రవారం సీతారామచంద్రస్వామి వారి నిత్య కళ్యాణ వేడుకను శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భాలయంలో స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ ఉత్సవ మూర్తులను బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం అనంతరం కంకణధారణ గావించి కల్యాణాన్ని జరిపారు. ఈ వేడుకను వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
Similar News
News March 3, 2026
NZB: రూ.3.90 లక్షల జరిమానా

నిజామాబాద్‌లో డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన ఇద్దరికి ఒక్కొక్కరికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ హైమద్ మొయినుద్దీన్ సోమవారం తీర్పు వెల్లడించారని NZB ట్రాఫిక్ CI పబ్బ ప్రసాద్ తెలిపారు. అలాగే 39 మందికి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ.3.90 లక్షల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.
News March 3, 2026
నేడు ఖమ్మం కమిషనరేట్‌లో మద్యం దుకాణాలు బంద్

హోలీ పండుగను పురస్కరించుకుని ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలను మూసివేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశించారు. రేపు ఉదయం 6 గంటల నుంచి మార్చి 4వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు, బార్లు, కల్లు దుకాణాలు బంద్ చేయాలని స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News March 3, 2026
ఈరోజు నమాజ్ వేళలు (03-3-2026) మంగళవారం

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.44 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.33 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.51 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 4.13 గంటలకు ♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.45 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.58 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


