News February 27, 2026

ALERT: ఎల్లుండి నుంచి కొత్త రూల్

image

ఇండియాలో మెసేజింగ్ యాప్‌లకు ‘సిమ్ బైండింగ్’ నిబంధన మార్చి 1 నుంచి అమలుకానుంది. దీనివల్ల మీ ఫోన్‌లో ఫిజికల్‌గా సిమ్ ఉంటేనే వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి యాప్స్ పనిచేస్తాయి. ఈ గడువును పెంచేందుకు కేంద్రం నిరాకరించింది. అంతేకాకుండా ఇకపై కంప్యూటర్ లేదా వెబ్‌లో లాగిన్ అయిన వారు ప్రతి 6 గంటలకు ఒకసారి మళ్లీ అథెంటికేషన్ చేయాలి. లేదంటే ఆటోమేటిక్‌గా లాగ్ అవుట్ అవుతుంది.

Similar News

News March 7, 2026

టీమ్ ఇండియాపైనే ఒత్తిడి: షోయబ్ అక్తర్

image

T20 WC ఫైనల్‌లో టీమ్ ఇండియాపైనే ఒత్తిడి ఉందని పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ చెప్పారు. ‘అహ్మదాబాద్‌లో 175-200 స్కోరు నమోదు కావచ్చు. ఒకవేళ న్యూజిలాండ్ 225-250 కొడితే భారత్‌పై ప్రెజర్ పడుతుంది. ఎందుకంటే 150 కోట్ల మంది చూస్తుంటారు. పైగా ఇదే గ్రౌండ్‌లో 2023 ODI WC ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఇండియా ఓడింది’ అని అన్నారు. IND టైటిల్ ఫేవరేట్ అని, అయితే NZ గెలవడం కూడా క్రికెట్‌కు మంచిదని అభిప్రాయపడ్డారు.

News March 7, 2026

కర్ణాటక HCలో శ్రీలంక SC జడ్జి పిటిషన్.. ఎందుకంటే?

image

ఆన్‌లైన్ కంటెంట్ కారణంగా తన పరువుకు భంగం కలుగుతోందని శ్రీలంక SC జడ్జి జస్టిస్ నవాజ్ కర్ణాటక HCలో పిటిషన్ వేశారు. వాటి ఆధారంగా SL మీడియా వ్యతిరేకంగా కథనాలు ప్రచురిస్తోందని, ఆ కంటెంట్ తొలగించేలా ఆదేశాలివ్వాలని కోరారు. కేంద్రం, గూగుల్ INDను ప్రతివాదులుగా చేర్చారు. శ్రీలంక SC జడ్జి తమ దేశంలో పరువునష్టం దావా వేయడం అక్కడి నిబంధనలకు విరుద్ధం. గూగుల్ IND HQ బెంగళూరులో ఉండటంతో పిటిషన్ వేశారు.

News March 7, 2026

నేపాల్‌లో ఛేంజ్.. భారత్‌కు కలిసొస్తుందా?

image

నేపాల్‌‌లో ఎన్నికల్లో బాలెన్ షా ఆధ్వర్యంలోని ప్రజా స్వతంత్ర పార్టీ గెలుపుదిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌తో నేపాల్ బంధం ఎలా ఉంటుందనేది చర్చనీయాంశమైంది. PM అభ్యర్థి అయిన షా జాతీయవాది. గతంలో భారత్ వ్యతిరేకత వ్యాఖ్యలతో వివాదాల్లో చిక్కుకున్నారు. కానీ గత పాలకుల తరహాలో చైనాకు ఫేవర్ లేకపోవడం భారత్‌కు కలిసొచ్చే విషయం. బ్యాలెన్స్డ్ ఫారిన్ రిలేషన్స్ కోరుకుంటున్నానని షా మ్యానిఫెస్టోలో చెప్పారు.