News February 27, 2026

తిరుపతి: ఇంటర్ పరీక్ష.. 181 మంది గైర్హాజరు

image

రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం హిస్టరీ, బోటనీ పరీక్షలు జరిగాయి. ఇందులో భాగంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా 58 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 2,146 మంది విద్యార్థులకు గాను 1,965 మంది పరీక్షకు హాజరైనట్లు RIO రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 181 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు ఆయన తెలియజేశారు.

Similar News

News March 2, 2026

విజయవాడ: కలెక్టరేట్ PGRSకు 174 వినతులు

image

NTR కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌కు మొత్తం 174 అర్జీలు అందినట్లు కలెక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 66, పురపాలక 26, పోలీస్ శాఖకు 18 వినతులు వచ్చాయి. ప్రతి అర్జీని నిర్దిష్ట గడువులోగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. పారదర్శకమైన సేవలందించడంలో నిర్లక్ష్యం వహించవద్దని ఆయన స్పష్టం చేశారు.

News March 2, 2026

ఐసీడీఎస్ పనితీరుపై కలెక్టర్ సమీక్ష

image

కర్నూలు కలెక్టరేట్ సమావేశ మందిరంలో CDPOలు, సూపర్వైజర్లతో ICDS శాఖ పనితీరుపై మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, కలెక్టర్ ఏ.సిరి ఇవాళ సమీక్షించారు. ప్రజల్లో శాఖపై సానుకూల అభిప్రాయం పెంపు కోసం చర్యలు తీసుకోవాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. లబ్ధిదారులకు పోషకాహారం, గర్భిణులకు అందే సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

News March 2, 2026

పాక్ చెత్త ఆట.. ఒక్కో క్రికెటర్‌పై 50 లక్షల ఫైన్!

image

T20 WC సెమీస్ చేరడంలో ఫెయిల్ అయిన పాక్ ప్లేయర్లపై ఆ దేశ క్రికెట్ బోర్డు సీరియస్ అయ్యింది. ఒక్కొక్కరికీ 50 లక్షల పాకిస్థానీ రూపాయల (సుమారు ₹16 లక్షలు) ఫైన్ వేసినట్లు ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ పేర్కొంది. గ్రూప్ స్టేజ్‌లో ఇండియా చేతిలో ఓడినప్పుడే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. S-8లో ఇంగ్లండ్ చేతిలో ఓడటం, తర్వాత శ్రీలంకపై గెలిచినా రన్ రేట్ సరిపోకపోవడంతో పాక్ టోర్నీ నుంచి బయటకొచ్చిన సంగతి తెలిసిందే.