News February 27, 2026

NTR: CRDAలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

image

AP CRDAలో కాంట్రాక్ట్ పద్ధతిన MIS ఆపరేటర్, ESM యూనిట్ డైరెక్టర్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, DEE-ఎలక్ట్రికల్ (MEP సర్వీసెస్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 2లోపు https://crda.ap.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని CRDA కమిషనర్ కె.కన్నబాబు సూచించారు. విద్యార్హత, దరఖాస్తు విధానం తదితర వివరాలకు పై అధికారిక వెబ్‌సైట్ సందర్శించాలన్నారు.

Similar News

News March 7, 2026

ప్రొద్దుటూరు: 5వ తరగతి విద్యార్థి మృతి

image

ప్రొద్దుటూరు నడింపల్లె మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో విషాదం నెలకొంది. 5వ తరగతి విద్యార్థి షేక్ మస్తాన్ వలీకి పాఠశాలలో శనివారం ఫిట్స్ వచ్చింది. తల్లిదండ్రులకు టీచర్లు సమాచారం ఇచ్చారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే విద్యార్థి మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. టీచర్ల నిర్లక్ష్యంతోనే విద్యార్థి మృతి చెందినట్లు పేరెంట్స్ ఆరోపిస్తున్నారు.

News March 7, 2026

విశాఖ: పన్నులు చెల్లించకుంటే జప్తే

image

ఆర్థిక సంవత్సరం ముగుస్తుండగా జీవీఎంసీ అధికారులు పన్నుల వసూళ్లపై దృష్టి సారించారు. రూ.650 కోట్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు మొండి బకాయిదారులపై చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే 1,36,149 మంది బకాయిదారులను గుర్తించి, 1,10,136 మందికి జప్తు నోటీసులు జారీ చేశారు. నీటి పన్ను చెల్లించని 62,290 మందికి కనెక్షన్లు తొలగిస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం రూ.458.9 కోట్లు వసూలు కాగా, రూ.188.20 కోట్లు రావాల్సి ఉంది.

News March 7, 2026

వాహనం తీస్తున్నారా? ఓ సారి చెక్ చేయండి!

image

ఎండ వేడిమికి మూగజీవాలు చల్లదనం కోసం ఆగి ఉన్న వాహనాల కింద తలదాచుకుంటుంటాయి. వాహనదారులు గమనించకుండా బండిని స్టార్ట్ చేసి ముందుకు తీయడం వల్ల ఇవి చక్రాల కింద పడి తీవ్రంగా గాయపడటం, ప్రాణాలు కూడా కోల్పోవడం వంటివి జరుగుతాయి. కాబట్టి వాహనం తీసే ముందు ఒక్కసారి కింద ఏమైనా ఉన్నాయేమో చెక్ చేయాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. అలాగే మిద్దెపై, ఆరుబయట పక్షుల కోసం నీటిని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.