News February 27, 2026

ప్రాధాన్యత పనులపై ప్రతిపాదనలు పంపండి: కలెక్టర్

image

జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ప్రాధాన్యత పనులపై సమీక్షించి, వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాలని కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ ఆదేశించారు. ఆర్&బీ, ఇరిగేషన్, తుడా, మున్సిపల్ కార్పొరేషన్ శాఖలకు చెందిన ప్రాధాన్యత పనుల వివరాలను త్వరగా సిద్ధం చేయాలని సూచించారు. దీర్ఘకాలిక అంశాలపై పూర్తి నివేదికలు ప్రభుత్వానికి పంపాలని స్పష్టం చేశారు.

Similar News

News March 2, 2026

స్పేస్ రేస్ మళ్లీ మొదలైంది.. ఎందుకు? – 1/2

image

ఒకప్పుడు US, సోవియట్ యూనియన్‌లు అంతరిక్షంలో పైచేయి కోసం పోటాపోటీగా ప్రాజెక్టులు చేపట్టాయి. మూన్ ల్యాండింగ్‌పై నాసాకు పోటీగా చైనా కూడా ప్రాజెక్ట్ స్పీడప్ చేసినట్లు ప్రకటించడంతో మరోసారి ఇది తెరమీదకు వచ్చింది. 2028 నాటికి చంద్రుడిపైకి మనుషులను పంపాలని నాసా ప్లాన్ చేయగా.. చైనా ఈ టార్గెట్ 2030కి పెట్టుకుంది. మరోవైపు భారత్ సైతం 2040 నాటికి వ్యోమగాములను చంద్రుడిపైకి దింపాలని అనుకుంటోంది.

News March 2, 2026

స్పేస్ రేస్ మళ్లీ మొదలైంది.. ఎందుకు? – 2/2

image

మూన్ ల్యాండింగ్‌తో పాటు వివిధ స్పేస్ ప్రాజెక్టులపైనా భారత్ ఫోకస్ పెంచింది. ఇదంతా ఒకప్పుడు ప్రతిష్ఠ కోసమైతే ఇప్పుడు అది అవసరం. అంతరిక్షంపై పట్టు ఉంటేనే భవిష్యత్తులో భౌగోళిక రాజకీయాలను శాసించగలమని, రక్షణ వ్యవస్థను పటిష్ఠం చేసుకోగలమని ప్రపంచ దేశాలు విశ్వసిస్తున్నాయి. అంతేకాదు స్పేస్‌లో మరింత లోతుగా అన్వేషించేందుకు చంద్రుడిని వ్యోమనౌకల రీఫ్యూల్లింగ్ స్టేషన్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.

News March 2, 2026

మెండోరా: హాస్టల్‌లో విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. వ్యక్తి అరెస్టు

image

మెండోరా మండలం పోచంపాడ్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్న వ్యక్తి కొన్ని రోజుల కిందట ఓ విద్యార్థినిని లైంగికంగా వేధించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేధించిన వ్యక్తి జక్రాన్‌పల్లి మండలానికి చెందిన నెహ్రూగా గుర్తించి అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు మెండోర SI సుహాసిని తెలిపారు.