News May 3, 2024
గుంటూరు: పంపిణీకి సిద్ధమైన పోస్టల్ బ్యాలెట్‌లు

గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్, బ్యాలెట్ పేపర్లు పంపిణీకి సిద్ధం చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లో పోస్టల్ బ్యాలెట్, బ్యాలెట్ పత్రాలను ఇతర జిల్లాలకు, జిల్లాలోని అసెంబ్లీ నియోజక వర్గాల పంపిణీకి సిద్ధం చేస్తున్న ప్రక్రియను గుంటూరు పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పరిశీలించారు. నోడల్ అధికారులు శ్యాంసుందర్, రఘు పాల్గొన్నారు.
Similar News
News March 13, 2026
తెనాలిలో రన్నింగ్ బస్సు కిందకి దూసుకెళ్లిన టెన్త్ విద్యార్థి

తెనాలి మారీసుపేటలోని హైస్కూల్‌కు చెందిన 10వ తరగతి విద్యార్థి లీలాసాయి మణికంఠ ఒక్కసారిగా బస్సు కిందకి దూసుకు వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. కొత్త వంతెన వద్ద డివైడర్‌పై నడిచి వెళుతున్న అతను అదే సమయంలో నగరం నుంచి తెనాలి వస్తున్న RTC బస్సు కిందకు దూసుకు వెళ్లాడు. డ్రైవర్ గమనించి బ్రేక్ వేయడంతో ప్రమాదం తప్పింది. స్పృహ కోల్పోయిన విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 13, 2026
గుంటూరు: రేపు జాతీయ లోక్ అదాలత్

జాతీయ లోక్ అదాలత్‌ను ఈ నెల 14న నిర్వహిస్తున్నట్లు గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. 14న ఉదయం 10 గంటల నుంచి జిల్లా న్యాయస్థానం ఆవరణలో లోక్ అదాలత్ జరుగుతుందన్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్‌లో సివిల్, కాంపౌండబుల్, క్రిమినల్ కేసులు, కుటుంబ, వివాహ సమస్యలు పరిష్కరించుకోవచ్చని చెప్పారు.
News March 13, 2026
GNT: గ్యాస్ వినియోగదారులకు హెల్ప్ లైన్ నెంబర్

గుంటూరు జిల్లాలో LPG కొరత లేదని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. గ్యాస్ నిల్వలు తగ్గుతాయనే ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. జిల్లాలో గ్యాస్ సరఫరాపై పర్యవేక్షణ కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ 8309160972, 6309520569 ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అవసరాలకు తగిన విధంగా సిలిండర్ల సరఫరా కొనసాగుతుందని తెలిపారు.


