News February 27, 2026
కామారెడ్డి: బాధితుల వద్దకే పోలీసులు: ఎస్పీ

బాధితుడి ముంగిటకే వెళ్లి న్యాయం అందించే ‘సిటిజన్ సెంట్రిక్ పోలీసింగ్’ విధానాన్ని కామారెడ్డి జిల్లా పోలీసులు విజయవంతంగా అమలు చేస్తున్నారు. జిల్లాలో రెండు రోజుల్లో ఈ విధానం ద్వారా ఐదు వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు బాధితుల వద్దకు వెళ్లి ఫిర్యాదును స్వీకరించి FIRలను అందజేశారు. ఈ సేవలు పోలీసుల పట్ల ప్రజల్లో ఉన్న సామాజిక దృక్పథాన్ని మారుస్తున్నాయని ఎస్పీ రాజేశ్ చంద్ర ఆశాభావం వ్యక్తం చేశారు.
Similar News
News March 1, 2026
రెండు రోజుల పాటు శ్రీవారి SSD టోకెన్లు రద్దు

AP: నేడు, రేపు శ్రీవారి స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీని టీటీడీ రద్దు చేసింది. ఈనెల 3న చంద్రగ్రహణం కారణంగా ఈనెల 2, 3 తేదీలకు సంబంధించిన SSD టోకెన్లను క్యాన్సిల్ చేసింది. మళ్లీ 4వ తేదీకి సంబంధించిన టోకెన్లను ఈనెల 3న జారీ చేస్తారు. ఇక 3న వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా టీటీడీ రద్దు చేసింది.
News March 1, 2026
కామారెడ్డి: ట్రిపుల్ సెంచరీ దాటిన చికెన్ ధరలు

కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు మండలాల్లో ఆదివారం చికెన్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపించాయి. గత వారంతో పోలిస్తే ధరలు భారీగా పెరిగి ‘ట్రిపుల్ సెంచరీ’ని దాటాయి. ప్రస్తుతం స్కిన్ లెస్ చికెన్ కిలో రూ.300 పలుకుతుండగా, లైవ్ కోడి రూ.190గా ఉంది. మటన్ కిలో రూ.800, బోటి రూ.400 చొప్పున విక్రయిస్తున్నారు. పెరుగుతున్న ధరలతో మాంసం ప్రియులు బెంబేలెత్తుతున్నారు.
News March 1, 2026
KTDM: ‘నా చావుకు ఎవరూ బాధ్యులు కారు, కేవలం జాబ్ టెన్షన్’

భద్రాచలం వ్యాపారి కంభంపాటి శ్రీనివాస్ కుమారుడు జశ్వంత్ శుక్రవారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఎంబీఏ పూర్తి చేసిన జశ్వంత్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. సరైన ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపానికి గురైన అతను.. “నా చావుకు ఎవరూ బాధ్యులు కారు, కేవలం జాబ్ టెన్షన్ వల్లే ఈ నిర్ణయం తీసుకుంటున్నా” అని తన సోదరుడికి వాట్సప్‌లో మెసేజ్ పంపాడు. ఆందోళనతో కుటుంబ సభ్యులు గాలించగా, చివరకు నదిలో అతని మృతదేహం లభ్యమైంది.


