News February 27, 2026
బొత్స త్వరగా కోలుకోవాలని పవన్ కళ్యాణ్ ట్వీట్

శాసన మండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ <<19254122>>అస్వస్థత<<>>కు గురైనట్టు తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘బొత్స సత్యనారాయణ గారు అస్వస్థతకు గురయ్యారని తెలిసి బాధపడ్డాను. ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు అందించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. (ఫైల్ ఫొటో).
Similar News
News March 4, 2026
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

యుద్ధం మొదలైన రోజు అమాంతం పెరిగిన బంగారం, వెండి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ వీటి ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.3,110 తగ్గి రూ.1,64,510కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.2,850 పతనమై రూ.1,50,800 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.20వేలు తగ్గింది. ప్రస్తుతం కేజీ సిల్వర్ రేటు రూ.2,95,000గా ఉంది.
News March 4, 2026
జనగామలో విషాదం.. అన్నదమ్ముల మృతి

జనగామలో మంగళవారం జరిగిన <<19292392>>రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మరాఠీ దినేష్ (24), భూణేష్ (21)<<>> వరుసకు అన్నదమ్ములు. వీరు జనగామ జ్యోతి నగర్‌లో వారి కుటుంబ సభ్యులతో నివసిస్తున్నారు. దినేష్ ఫొటో గ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. స్నేహితులతో హోలీ సంబరాలు చేసుకొని, సిద్దిపేట ఫ్లై ఓవర్ మీదుగా వస్తుండగా టాటా ఏస్ వాహనాన్ని ఢీకొని మృతి చెందిన విషయం తెలిసిందే. టాటా ఏస్ వాహన డ్రైవర్ ఎంజీఎంలో చికిత్స పొందుతున్నారు.
News March 4, 2026
‘మద్యం’లో డిజిటల్ చెల్లింపులను పెంచేలా త్వరలో పాలసీ!

AP: మద్యం విక్రయాల్లో ప్రస్తుతం 30%గా ఉన్న డిజిటల్ చెల్లింపులను 60%కి పెంచేందుకు ఎక్సైజ్ శాఖ ‘లిక్కర్ డిజిటల్ చెల్లింపులు’ పాలసీని తీసుకురానుంది. దీని ప్రకారం ప్రతి షాపులో డిజిటల్ పేమెంట్ సౌకర్యం తప్పనిసరిగా ఉండాల్సిందే. కొనుగోలుదారులు డిజిటల్ చెల్లింపులు చేస్తామంటే లైసెన్సీలు తిరస్కరించకూడదు. అలాగే ఏ రోజు ఎంత అమ్మారో తెలుసుకునేందుకు ‘ట్రాక్ అండ్ ట్రేస్’ విధానాన్ని కూడా ఎక్సైజ్ శాఖ తీసుకురానుంది.


