News May 3, 2024

NZB: రణక్షేత్రంలా లోక్ సభ ఎన్నికల ప్రచారం

image

ఉమ్మడి జిల్లాలో లోక్ సభ ఎన్నికల ప్రచారం రణక్షేత్రంలా సాగుతోంది. అభ్యర్థులతో పాటు ఆయా పార్టీల అగ్రనేతలు, కార్యకర్తలు ప్రచార జోరును పెంచారు. జిల్లా, మండల, గ్రామస్థాయి నాయకులు ఇంటింటి ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. పార్టీల కరపత్రాలు, గుర్తులతో రూపొందించిన ఫ్లకార్డులను చేతబూని తమ అభ్యర్థికి ఓటేయమని అభ్యర్థిస్తున్నారు. ఇక సభలు, సమావేశాలు, రోడ్ షోలతో ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Similar News

News April 1, 2026

NZB: ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు బారికేడ్ల అందజేత

image

నిజామాబాద్ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు బారికేడ్లను, హోర్డింగులను అందజేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి చేతుల మీదుగా వాటిని ఇచ్చారు. బేటీ బచావో – బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా బాలికల లింగ నిష్పత్తిని పెంచేందుకు ప్రజల్లో అవగాహన పెంపొందించేలా బారికేడ్లు, హోర్డింగులు అందజేయడం అభినందనీయమన్నారు.

News April 1, 2026

NZB: కొండగట్టు పనుల్లో ఇంత నిర్లక్ష్యమా?: కవిత

image

కొండగట్టు అంజన్న ఆలయంలో చలువ పందిళ్లు కూలి 15 మంది గాయపడిన ఘటనపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విచారం వ్యక్తం చేశారు. హనుమాన్ జయంతి వేడుకల కోసం నాసిరకంగా పందిళ్లు వేయడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కొండగట్టు అంజన్న ఆలయంలో ఉత్సవాల సమయంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.