News February 27, 2026
జగిత్యాల: బస్టాండ్‌లో అనుమానాస్పద మహిళ గుర్తింపు

జగిత్యాల కొత్త బస్టాండ్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న మహిళను స్థానికులు గుర్తించి విచారించారు. ఆమె గిరి మని లక్ష్మీనరసు (47)నిజామాబాద్ జిల్లా వాసిగా తెలిపింది. నాలుగు రోజుల క్రితం ఇంట్లో గొడవ జరిగి బయటకు వచ్చానని వెల్లడించింది. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో విధుల్లో ఉన్న పోలీసు అధికారులకు ఆమెను అప్పగించారు. పోలీసులు వివరాలు నమోదు చేసి కుటుంబ సభ్యులతో సంప్రదింపులు చేపట్టారు.
Similar News
News March 10, 2026
GNT: పీపీటీ టెస్టులో కానిస్టేబుల్ మృతి

మంగళగిరి 6వ బెటాలియన్‌లో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. బెటాలియన్ నిర్వహించిన PPT టెస్టులో పాల్గొన్న హెడ్ కానిస్టేబుల్ కె.వెంకటేశ్వరరావు (1836) అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వెంకటేశ్వరరావు డాగ్ స్క్వాడ్‌లో సేవలు అందిస్తున్నారు. విజయవాడలోని రామవరప్పాడులో ఆయన నివాసముంటున్నారు.
News March 10, 2026
T20WC గెలుపు.. పెళ్లికి సిద్ధమైన భారత క్రికెటర్

T20WC గెలుపు సంతోషంలో ఉన్న భారత క్రికెటర్ కుల్దీప్ యాదవ్ పెళ్లికి సిద్ధమయ్యారు. తన చిన్ననాటి స్నేహితురాలు వన్షికతో ఈ నెల 14న ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో ఏడడుగులు వేయనున్నారు. మార్చి 17న లక్నోలో రిసెప్షన్ జరగనుంది. వీరికి గతేడాది జూన్ 4న ఎంగేజ్‌మెంట్ జరిగిన విషయం తెలిసిందే. నవంబర్‌లో మ్యారేజ్ జరగాల్సి ఉండగా T20WC ప్రిపరేషన్స్ కోసం కుల్దీప్ వాయిదా వేశారు.
News March 10, 2026
రికార్డులను పరిశీలిస్తున్న ఏకసభ్య కమిషన్

తిరుమల కల్తీ నెయ్యి కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ తన పనిని ప్రారంభించింది. సిబ్బందికి గత వారంలో తిరుపతి పద్మావతి అతిథి గృహంలో కార్యాలయం ఏర్పాటు చేశారు. సోమవారం కమిషన్ హెడ్ దినేశ్ కుమార్ కార్యాలయంలో నెయ్యి టెండర్లు, వాటికి సంబంధించిన పత్రాలను పరిశీలించారు.


