News February 27, 2026
అభిషేక్ పోస్ట్.. చెప్పు చూపించిన యువీ!

T20WC: నిన్నటి మ్యాచ్‌లో రాణించడాన్ని యువ క్రికెటర్ అభిషేక్ శర్మ ఇన్‌స్టా పోస్ట్‌తో సెలబ్రేట్ చేసుకోగా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తనదైన శైలిలో స్పందించారు. అభిషేక్ పోస్టుకు సరదాగా ఓ చెప్పు ఎమోజీని పెట్టారు. గతంలోనూ యువీ అభిషేక్‌కు ఈ తరహా ఎమోజీలు పెట్టారు. ఆటపై మరింత దృష్టిపెట్టాలని హెచ్చరించడమే దీని ఉద్దేశం. మరోవైపు అభిషేక్ ప్రదర్శనను మెచ్చుకుంటూ ఇన్‌స్టాలో యువరాజ్ స్టోరీ పోస్ట్ చేశారు.
Similar News
News March 2, 2026
సౌదీ, బహ్రెయిన్ పాలకులకు మోదీ ఫోన్

గల్ఫ్ దేశాధినేతలకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. సౌదీ అరేబియా ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్, బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఖలీఫాతో మాట్లాడారు. ఆ దేశాల్లో భారతీయుల భద్రత గురించి అడిగి తెలుసుకున్నారు. సౌదీ, బహ్రెయిన్‌పై దాడిని ఖండించారు.
News March 2, 2026
EAPCET దరఖాస్తు గడువు పొడిగింపు

AP: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే EAPCET దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. లేట్ ఫీజు లేకుండా మార్చి 17 వరకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్లు స్వీకరిస్తామని వెల్లడించారు. రూ.1,000 లేట్ ఫీజుతో మార్చి 21, రూ.2వేలతో మార్చి 25, రూ.4వేలతో మార్చి 30, రూ.10వేలతో ఏప్రిల్ 3 వరకు ఛాన్స్ ఇచ్చారు. కాగా మే 12-15 వరకు, 18-20 తేదీల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి.
News March 2, 2026
మొక్కజొన్నలో బొగ్గు కుళ్లు తెగులు లక్షణాలు

మొక్కజొన్నలో పూత దశ తర్వాత నేలలో తేమ శాతం తగ్గడం, వాతావరణంలో ఉష్ణోగ్రత పెరగడం వల్ల బొగ్గు కుళ్లు తెగులు కనిపిస్తుంది. నేలలోని శిలీంధ్రం మొక్కల వేర్ల ద్వారా కాండం పైభాగానికి వ్యాపించి గోధుమ రంగు చారలు ఏర్పడతాయి. ఈ తెగులు వల్ల పంట కోత దశకు రాకముందే కాండం భాగం విరిగి మొక్కలు నేలపై పడిపోతాయి. ఇలాంటి మొక్కలను చీల్చి చూసినపుడు లోపల బెండు భాగం కుళ్లి, తెలుపు రంగు నుంచి నలుపు రంగుకు మారడం గమనించవచ్చు.


