News February 27, 2026

VJA: చెన్నై వెళ్లే రైలు ప్రయాణికులకు ఊరటనిచ్చే వార్త

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా చెన్నై సెంట్రల్(MAS), సంత్రాగచ్చి (SRC) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. నెం.06077 MAS- SRC రైలును రేపు శనివారం నుంచి మార్చి 14 వరకు ప్రతి శనివారం, నెం.06078 SRC- MAS రైలును మార్చి 2 నుంచి మార్చి 16 వరకు ప్రతి సోమవారం నడుపుతామన్నారు. కాగా ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.

Similar News

News March 3, 2026

రానున్న 4 రోజులు జాగ్రత్త!

image

TG: రాష్ట్రంలో రానున్న 4 రోజులు టెంపరేచర్ 2-3 డిగ్రీలు పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్, కొత్తగూడెం, భూపాలపల్లి, గద్వాల, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, ములుగు, నాగర్ కర్నూల్, నారాయణ్ పేట, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో 36°C-40°C వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పింది. మిగతా జిల్లాల్లో 36°C కంటే టెంపరేచర్ తక్కువగా నమోదైనా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

News March 3, 2026

రాజమండ్రి కల్తీ పాల ఘటన.. పెరుగుతున్న మృతుల సంఖ్య..!

image

రాజమండ్రిలో కల్తీ పాల ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం తాజా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఈ ఘటనలో మొత్తం 20 మంది అడ్మిట్ కాగా, ఇప్పటి వరకు మొత్తం ఏడుగురు మృతి చెందినట్లు వెల్లడించారు. మిగిలిన 13 మంది బాధితులు వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. నిన్నటి వరకు ఆరుగురు మృతి చెందగా.. నేడు చౌడేశ్వర్ నగర్‌కు చెందిన జి.సూర్యరావు(81) మృతి చెందినట్లు తెలిపారు.

News March 3, 2026

లెబనాన్‌లోకి ఇజ్రాయెల్ సైన్యం

image

పశ్చిమాసియాలో యుద్ధం మరో స్థాయికి చేరింది. ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ లెబనాన్‌లోకి ప్రవేశించి సరిహద్దు వెంట వ్యూహాత్మక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. ఉత్తర ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా దాడులను అడ్డుకోవడానికి ‘సెక్యూరిటీ జోన్’ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ‘ఆపరేషన్ రోరింగ్ లయన్’ చేపట్టింది. దీనికి ప్రతిచర్యగా హెజ్బొల్లా కూడా ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై డ్రోన్లు, రాకెట్లతో విరుచుకుపడుతోంది.