News February 27, 2026

శ్రీవేంకటేశ్వర గోసంరక్షణ ట్రస్టుకు రూ.కోటి విరాళం

image

హైదరాబాద్‌కు చెందిన రాచమల్లు వెంకట సుజిత అనే భక్తురాలు టీటీడీ శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ ట్రస్టుకు శుక్రవారం రూ.కోటి విరాళంగా అందించారు. ఈ మేరకు తిరుమలలోని టీటీడీ ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఛైర్మన్ బీ.ఆర్.నాయుడుకు విరాళం చెక్కును అందజేశారు. దాత, కుటుంబ సభ్యులను ఛైర్మన్ అభినందించారు.

Similar News

News March 1, 2026

VZM: ఉదయాన్నే ప్రమాదం.. వ్యక్తి మృతి

image

రామభద్రపురం మండలం బూసాయవలస(ముచర్ల వలస) గ్రామ సమీపంలో సాయి కృష్ణ ఆగ్రో కోల్డ్ స్టోరేజ్ దగ్గర ఆదివారం ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. ఇతని వయసు సుమారు 65 ఏళ్లు ఉండవచ్చని భావిస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీస్‌లు దర్యాప్తు చేస్తున్నారు.

News March 1, 2026

GNT: విషాదం.. పిల్లలకు టిఫిన్ తెచ్చేందుకు వెళ్లి దుర్మరణం

image

తెనాలిలోని పినపాడు మద్రాస్ రైల్వే గేట్ వద్ద ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. కరేటి సురేశ్ (45) తన పిల్లల కోసం టిఫిన్ తెచ్చేందుకు బయటకు వెళ్లి, పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఒకేసారి రెండు రైళ్లు రావడంతో గందరగోళానికి గురైన సురేశ్‌ను ఒకటో నెంబర్ ట్రాక్‌పై వస్తున్న రైలు బలంగా ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయమై ఆయన ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

News March 1, 2026

తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ

image

తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ భారీగా పెరిగింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 22 గంటల సమయం పడుతోంది. శ్రీవారి దర్శనం కోసం శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు. శనివారం మొత్తం 75,428 మంది శ్రీవారిని దర్శించుకోగా, 36,240 మంది తలనీలాలు సమర్పించారు. అదే రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.56 కోట్లుగా నమోదైంది.