News February 27, 2026
HYD: Gen Z తెలివి.. ‘చెత్త’ నుంచి డబ్బు!

HYD యువతలో ఇప్పుడు ‘అప్‌సైక్లింగ్’ ఒక మతంలా మారుతోంది. మురికివాడల్లో పారేసిన టైర్లు, విరిగిన ప్లాస్టిక్ డబ్బాలను సేకరించి వాటిని లగ్జరీ ఫర్నీచర్‌గా మార్చి ఆన్‌లైన్‌లో అమ్ముతున్నారు. ఇది కేవలం వ్యాపారం కాదు.. పర్యావరణం మీద వారికున్న ‘యూనిక్’ ప్రేమ. పాత సామన్ల మార్కెట్ (జుమ్మెరాత్ బజార్) వీరి పాలిట ఇప్పుడు ఒక ఐడియా బ్యాంక్. వ్యర్థాలను అర్థాలుగా మార్చుతున్న ఈ Gen Z తెలివితేటలు అమోఘం.
Similar News
News March 1, 2026
సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు: రాజగోపాల్ రెడ్డి

TG: సీఎం రేవంత్‌పై ఓ వైపు ప్రశంసలు కురిపిస్తూనే మరోవైపు తనదైన శైలిలో మునుగోడు MLA రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ‘మునుగోడుకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసినందుకు CMకు ధన్యవాదాలు. విద్యావ్యవస్థలో మార్పులు తెస్తున్నారు. గత ప్రభుత్వం విద్యను గాలికి వదిలేసింది’ అని అన్నారు. మరోవైపు హైదరాబాద్‌కు పక్కనే ఉన్న మునుగోడును పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అభివృద్ధిలో ఇంకా వెనుకబడి ఉందని పేర్కొన్నారు.
News March 1, 2026
హనుమకొండ జిల్లాలో తీవ్ర విషాదం

జిల్లాలోని కమలాపూర్ మండలం లక్ష్మీపూర్ వద్ద బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. శనిగరంలో స్నేహితుడి అంత్యక్రియలకు హాజరై శనిగరం నుంచి కమలాపూర్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతులను శనిగరానికి చెందిన వట్టెంల నాగరాజు (20), బండి వినయ్ (18)గా గుర్తించారు.
News March 1, 2026
చరిత్ర పుటల్లో గద్వాల రాజకుమారి వివాహ వైభవం

ఆందోల్-పాపన్నపేట సంస్థానాధీశుడితో గద్వాల సంస్థానాధీశుల కుమార్తె వివాహం అత్యంత వైభవంగా జరిగింది. గద్వాల రాజులు తన కుమార్తెకు అపురూపమైన కానుకలను అరణంగా సమర్పించారు. ఇందులో ముఖ్యంగా పచ్చల హారం ధరించిన తెల్లని పంచకళ్యాణి గుర్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ గుర్రానికి ఒక కాలికీ వెండి, మరో కాలికీ బంగారు కడియాలు అమర్చారు. కేవలం కానుకలే కాకుండా, భారీ సంఖ్యలో దాసదాసీలు 3 వేల మంది సైనికులు కూడా వెళ్లారు.


