News February 27, 2026

KK లైన్ కోల్పోయిన దక్షిణ కోస్తా రైల్వే జోన్

image

APకి కీలకమైన కొత్తవలస-కిరండోల్ (KK లైన్) మార్గం దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధి నుంచి రాయగడ డివిజన్‌లోకి వెళ్లింది. వాల్తేరు డివిజన్‌లో KK లైన్లోని అరకు, బొర్ర గుహాలు,ఐరన్ ఓర్,బొగ్గు వంటి భారీ కార్గో రవాణాతో జోన్‌కు భారీ ఆదాయం వచ్చేది. కొత్తవలస జంక్షన్‌తో పాటు VZM, SKLM జిల్లాల్లోని కీలక సెక్షన్లు రాయగడ డివిజన్, ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌కు వెళ్లాయి. ఈ జోన్ ఆర్థిక స్థిరత్వంపై తీవ్ర ప్రభావం పడనుంది.

Similar News

News March 5, 2026

NGKL: జిల్లాలోని పర్యాటక ప్రదేశాలు ఇవే..!

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో చూడదగ్గ పర్యాటక ప్రదేశాలు అనేకం ఉన్నాయి. అమ్రాబాద్‌లోని దట్టమైన నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉమామహేశ్వర స్వామి ఆలయం. కృష్ణానదిని ఆనుకొని కొల్లాపూర్ నుంచి 9 కిలోమీటర్ల దూరంలో అక్కమహాదేవి గుహలు ఉన్నాయి. లొద్ది మల్లయ్య ఆలయం మన్ననూర్ చెక్ పోస్ట్ తెలంగాణ అమర్నాథ్ గుహగా పిలువబడే ప్రదేశంలో ఆరు జలపాతాలు, గుహలో శివలింగం ఉంది. మల్లెల తీర్థం, పరహాబాద్ టైగర్ రిజర్వ్ చూడదగ్గ ప్రదేశాలు.

News March 5, 2026

మీరు చేసే పనులపై CM నిఘా.. కలెక్టర్ ఏం చెప్పారంటే?

image

CM చంద్రబాబు జిల్లాల పనితీరును నేరుగా పర్యవేక్షిస్తున్నారని కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం తెలిపారు. అధికారులు మరింత బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో పనిచేయాలని ఆదేశించారు. పౌర సేవలు, సంక్షేమ పథకాల అమలు, ఫిర్యాదుల పరిష్కారంపై క్రమం తప్పకుండా విశ్లేషణ జరుగుతోందని స్పష్టం చేశారు. ఒక టీంగా పనిచేసి ప్రజలకు మెరుగైన ఫలితాలు అందించాలని యంత్రాంగాన్ని కోరారు.

News March 5, 2026

తూ.గో: అగ్నివీర్ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

విశాఖపట్నం ఆర్మీ రిక్రూటింగ్ కార్యాలయం ద్వారా అగ్నివీర్ నియామకాలకు ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం తెలిపారు. అవివాహిత పురుష అభ్యర్థులు ఈనెల 13 నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఆసక్తి గల జిల్లా అభ్యర్థులు Join Indian Army అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.