News February 27, 2026
కాంగ్రెస్ నిరసనలకే పరిమితమైంది: పీఎం మోదీ

1984 నుంచి కాంగ్రెస్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతూ వస్తోందని.. ఇప్పుడు నిరసనలకే పరిమితమైందన్నారు పీఎం మోదీ. ఆర్టికల్ 370 రద్దు, CAA, ట్రిపుల్ తలాక్ రద్దు, UPI, స్వచ్ఛభారత్, కరోనా వ్యాక్సిన్.. ఇలా సంస్కరణలు అన్నింటినీ వ్యతిరేకించిందన్నారు. ప్రతిపక్షం అంటే విమర్శలే కాదని, ప్రత్యామ్నాయ విజన్ చూపాలని హితవు పలికారు. కాంగ్రెస్‌కు మిలీనియల్స్ బుద్ధి చెప్పారని.. ఇప్పుడు జెన్‌జీలు సిద్ధంగా ఉన్నారన్నారు.
Similar News
News March 2, 2026
చరిత్రలో ఈరోజు (మార్చి 2)

* 1933: బాలీవుడ్ సంగీత దర్శకుడు పద్మశ్రీ ఆనంద్‌జీ వీర్జీ షా జననం
* 1936: రంగస్థల నటుడు అబ్బూరి గోపాలకృష్ణ జననం
* 1962: తెలంగాణ కవి యాకూబ్ జననం
* 1938: నాటకకర్త వడ్డాది సుబ్బారాయుడు మరణం
* 1949: స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత కోకిల సరోజిని నాయుడు మరణం (ఫొటోలో)
* 1990: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి మహిళా మంత్రి మసూమా బేగం మరణం
News March 2, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News March 2, 2026
యూఏఈపై ఇరాన్ దాడులు.. ఖండించిన ప్రధాని మోదీ

అమెరికా, ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడుల్లో భాగంగా ఇరాన్ యూఏఈపై విరుచుకుపడటాన్ని ప్రధాని మోదీ తప్పుపట్టారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపిన మోదీ.. యూఏఈకి భారత్ అండగా ఉంటుందని తెలిపారు. అక్కడి పరిస్థితిపై యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యన్‌తో మాట్లాడినట్లు పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో అక్కడి భారతీయులు క్షేమంగా ఉండేందుకు UAE చేస్తున్న కృషికి ధన్యవాదాలు తెలిపారు.


