News February 27, 2026

కామారెడ్డి జిల్లాలో క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

image

కామారెడ్డి జిల్లాలో క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శుక్రవారం గరిష్ఠ ఉష్ణోగ్రత 34.9°Cలు నమోదు కాగా, నిన్న ఉష్ణోగ్రత 36.2°C, రేపటి ఉష్ణోగ్రత 35°C, ఎల్లుండి 35.1°C ల ఉష్ణోగ్రతలు నమోదుకానున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఉక్కపోత ఉండగా, ఉదయం వాతావరణం చల్లబడుతుంది. కామారెడ్డి జిల్లాలో ఎల్లో అలెర్ట్ జారీ చేయగా ప్రజలు జాగ్రతలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Similar News

News March 3, 2026

వాహనదారులకు రిలీఫ్.. పెట్రోల్ ధరల హైక్ ఇప్పట్లో లేనట్లే!

image

మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలతో పెరిగిన ముడిచమురు ధరల ఎఫెక్ట్ దేశంలోని పెట్రోల్, డీజిల్ ధరలపై ఉంటుందనే ఆందోళన మొదలైంది. అయితే ఇప్పట్లో ఇంధన ధరల పెరుగుదల ఉండదని సమాచారం. ఇప్పటివరకు ఇంధన సంస్థలు చమురు ధరలు పెరిగినప్పుడు భారం భరించి, తగ్గినప్పుడు రికవర్ చేసుకుంటూ వచ్చాయి. ఇప్పుడు కూడా కేంద్రం ఇదే పాలసీని కంటిన్యూ చేయనున్నట్లు తెలుస్తోంది. చివరగా 2022 ఏప్రిల్‌లో ధరలు పెరిగాయి.

News March 3, 2026

చంద్రగ్రహణమైనా ఈ ఆలయాలు తెరిచే ఉంటాయి!

image

చంద్రగ్రహణం వల్ల ఈరోజు దేశంలోని ఆలయాలు మూతపడినా కొన్ని మాత్రం తెరిచే ఉంటాయి. ఏపీలో శ్రీకాళహస్తి ఈ జాబితా ఉండగా, తమిళనాడులో అరుణాచలేశ్వర ఆలయం ఉంది. కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణ ఆలయం, కేరళలోని తిరువరప్పు శ్రీకృష్ణ ఆలయం కూడా ఈరోజు తెరిచే ఉంటాయి. ఇక ఉత్తరాదిలో మహాకాళేశ్వర్ (ఎంపీ), కల్కాజీ దేవి (ఢిల్లీ), విష్ణుపద్ (బిహార్), లక్ష్మీనాథ్ టెంపుల్ (RJ), కల్పేశ్వర్ (UKD) ఆలయాలు ఈరోజు తెరిచే ఉంటాయి.

News March 3, 2026

కామారెడ్డి: ప్రణామ్ డే కేర్ సెంటర్‌లో ఉద్యోగ అవకాశాలు

image

కామారెడ్డిలోని ప్రణామ్ డే కేర్ సెంటర్‌లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నియమకాలు చేపట్టనున్నట్లు జిల్లా మహిళలు, పిల్లలు, దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ జిల్లా అధికారులు తెలిపారు. సెంటర్‌లో పని చేయడానికి సూపరింటెండెంట్, పార్ట్ టైం ఆరోగ్య సిబ్బంది ఇతర ఉద్యోగాలకు, పదో తరగతి చదివి ఆసక్తి కలిగిన వారు ఈ నెల 13వ తేదీ లోపు జిల్లా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.