News February 28, 2026

సిరిసిల్ల: పీఎంశ్రీ కార్యక్రమాల అమలు పరిశీలన

image

కేంద్ర ప్రభుత్వ ‘పీఎంశ్రీ’ పథకం కింద పాఠశాలల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు, విద్యా కార్యక్రమాలను నోడల్ అధికారి, కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ జాయింట్ సెక్రటరీ ప్రవీర్ కుమార్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తంగళ్లపల్లి మండలం మండేపల్లి మోడల్ స్కూల్, కేంద్రీయ విద్యాలయాలను ఆయన సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

Similar News

News March 1, 2026

సీనియారిటీ జాబితాపై అభ్యంతరాల సేకరణ: విశాఖ డీఈవో

image

జిల్లాలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సాధారణ సీనియార్టీ జాబితాపై అభ్యంతరాలను సేకరించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్ వెల్లడించారు. జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్‌ కార్పొరేషన్ ఉపాధ్యాయుల్లో సీనియార్టీ జాబితాను వెబ్‌సైట్‌లో పొందుపరిచామన్నారు. దీనిపై అభ్యంతరాలను 7వ తేదీలోగా తెలియజేయాలని కోరారు. గడువు దాటిన తర్వాత అభ్యంతరాలను స్వీకరించబోమని ఆయన స్పష్టం చేశారు.

News March 1, 2026

విశాఖ: వెంకటాద్రి వంటిల్లు వద్ద యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ గేటు సమీపాన వెంకటాద్రి వంటిల్లు వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. మలుపు తిరిగే సమయంలో ఎలక్ట్రికల్ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందింది. ఆటోలో ఉన్న భార్యాభర్తలు గాయపడడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న త్రీ టౌన్ ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు.

News March 1, 2026

బాణసంచా కేంద్రాల్లో పోలీసుల తనిఖీలు

image

వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ఘటన నేపథ్యంలో అంబేడ్కర్ కోనసీమ జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో అటువంటి ఘటనలు జరగకూడదని ఎస్పీ రాహుల్ మీనా ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న బాణసంచా తయారీ, విక్రయ కేంద్రాల్లో పోలీసులు, అగ్నిమాపక, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో విస్తృత తనిఖీలు చేపట్టారు.