News February 28, 2026

సిద్దిపేట: ఆయిల్ ఫామ్ సాగుపై కలెక్టర్ సమీక్ష

image

ఆయిల్ ఫామ్ సాగుపై శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఉద్యానశాఖ, ఆయిల్ ఫామ్ అధికారులతో కలెక్టర్ హైమావతి సమీక్ష నిర్వహించారు. ఆయిల్ ఫ్రైడ్ అధికారుల పనితీరు మందకోడిగా ఉందని అసహనం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఆయిల్ ఫామ్ సాగుకు రైతులను ప్రోత్సహించాలని వ్యక్తిగతంగా కేటాయించిన లక్ష్యాన్ని తప్పనిసరిగా చేరుకోవాలని ఆదేశించారు.

Similar News

News March 5, 2026

HNK: గుర్తు తెలియని మృతదేహం లభ్యం

image

జిల్లాలోని ఐనవోలు మండలం సింగారం గ్రామ శివారులోని ఊర చెరువు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బుధవారం కుక్కలు మృతదేహాన్ని పీక్కుతింటుండగా గ్రామస్థులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి తల, చేతులు లేకపోవడంతో గుర్తు పట్టలేని స్థితిలో ఉంది. పురుషుడి మృతదేహంగా ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News March 5, 2026

వికారాబాద్‌లో పెరిగిన క్రయవిక్రయాలు!

image

వికారాబాద్ జిల్లాలో భూములు ఫ్లాట్లు ఇతరత్రా క్రయవిక్రయాలు జోరందుకున్నాయి. దీంతో ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుంది. గతేడాది ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి నాటికి జిల్లాలో రూ.54.56 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో అత్యధికంగా వికారాబాద్‌లో రూ.27.59 కోట్ల ఆదాయం సమకూరగా అత్యల్పంగా కొడంగల్లో రూ.6.05 కోట్ల ఆదాయం సమకూరింది.

News March 5, 2026

కర్నూలు: 395 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

image

పత్తికొండ శ్రీ వైష్ణవి డిగ్రీ కళాశాలలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి ఆనంద్ రాజ్ కుమార్, ప్రిన్సిపల్ రాజశేఖర్ తెలిపారు. ఈ జాబ్ మేళాలో వివిధ కంపెనీలలో 395 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఫార్మసీ చదివిన వారు అర్హులని పేర్కొన్నారు. వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలన్నారు. ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయని తెలిపారు.