News May 3, 2024

FLASH: రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో కీలక మలుపు

image

TG: దేశంలో సంచలనం సృష్టించిన HCU స్టూడెంట్ రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మరో మలుపు తిరిగింది. ఇవాళ ఉదయం ఆ కేసును <<13173448>>ముగించినట్లు<<>> పోలీసులు ప్రకటించగా, వర్సిటీలో విద్యార్థులు <<13175252>>ఆందోళనకు<<>> దిగారు. దీంతో కేసును రీఓపెన్ చేయాలని రాష్ట్ర డీజీపీ నిర్ణయించారు. పునర్విచారణకు అనుమతి కోరుతూ పోలీస్ శాఖ రేపు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది.

Similar News

News March 11, 2026

గ్యాస్ బుకింగ్ సిస్టమ్ క్రాష్!

image

సాధారణం కంటే 8-10 రెట్లు ఎక్కువగా ఫోన్ కాల్స్‌ రావడంతో ఇండేన్ గ్యాస్ బుకింగ్ సిస్టమ్ కుప్పకూలినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశంలో ఇండేన్‌కు 15 కోట్ల కనెక్షన్లు ఉన్నాయి. చాలామంది వినియోగదారులు IVRS మిస్డ్ కాల్ ద్వారానే గ్యాస్ బుకింగ్ చేస్తుంటారు. దేశంలో LPG కొరత ఏర్పడిందని తెలిసి బుకింగ్‌కు పోటెత్తడంతో ఇండేన్ బుకింగ్ సిస్టమ్ క్రాష్ అయింది. మరి మీకు ఇండేన్ గ్యాస్ బుక్ అవుతోందా? COMMENT

News March 11, 2026

ఎక్కడా గ్యాస్ కొరత లేదు: చంద్రబాబు

image

AP: స్కూళ్లు, ఆస్పత్రులకు అంతరాయం లేకుండా గ్యాస్ సరఫరా జరగాలని CM చంద్రబాబు సూచించారు. ‘ప్రస్తుతం కొరత లేదు. కేంద్రంతో మాట్లాడి ఇబ్బందులు రాకుండా చూడాలి. గుడ్లు, అరటి లాంటి ఉత్పత్తులకు ప్రత్యామ్నాయ మార్కెట్లను వెతకాలి. సిలిండర్లు బ్లాక్ మార్కెట్‌కు వెళ్లకుండా నిఘా పెట్టాలి’ అని కలెక్టర్ల సమావేశంలో ఆదేశించారు. గ్యాస్, ఉద్యాన ఉత్పత్తుల మార్కెట్ పరిస్థితుల అంచనాకు మంత్రులతో కమిటీని ఏర్పాటు చేశారు.

News March 11, 2026

అకౌంట్లలోకి డబ్బులు.. ఇలా చేయండి

image

ఎల్లుండి(ఈ నెల 13న) రైతుల <<19350621>>ఖాతాల్లో<<>> పీఎం కిసాన్ డబ్బులు జమ కానున్నాయి. అయితే అర్హులైన అన్నదాతలు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సూచించారు. పీఎం కిసాన్ <>పోర్టల్‌లో<<>> ఈ-కేవైసీ ఆప్షన్ సెలక్ట్ చేసుకొని ఓటీపీ/బయోమెట్రిక్‌ ద్వారా ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. ఫేస్ అథెంటికేషన్ మొబైల్ యాప్‌తోనూ సబ్మిట్ చేయొచ్చని పేర్కొన్నారు.