News February 28, 2026
కాకినాడ: 48 బైక్‌లు చోరీ.. ఒక్కొ కేసుకు 2 ఏళ్ల శిక్ష: సీఐ

కాకినాడ జిల్లాలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న శోంటిని గంగాధరన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఏకంగా 48 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. స్థానిక మేజిస్ట్రేట్ ముందు హాజరపరచగా ఒక్కో కేసుకు రెండేళ్ల చొప్పున జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. అలాగే దొంగిలించిన వాహనాలను కొనుగోలు చేసిన ఆరుగురికి ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున జరిమానా విధించినట్లు సీఐ వెల్లడించారు.
Similar News
News March 4, 2026
NLG: మహిళలు కనిపిస్తే చాలు.. దూసుకెళ్తున్న బస్సులు!

జిల్లాలో ఆర్టీసీ బస్సుల రాక కోసం పల్లె ప్రజలు వేయి కళ్లతో ఎదురు చూడాల్సి వస్తోంది. కొన్ని గ్రామాలకైతే బస్సు సౌకర్యమే లేదు. మహాలక్ష్మి పథకం నేపథ్యంలో స్టాప్‌లలో మహిళలు ఎక్కువగా ఉంటే ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సులను డ్రైవర్లు ఆపకుండానే వెళ్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. గంటల తరబడి నిలబడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. అధికారులు స్పందించి బస్సులు ఆపేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
News March 4, 2026
ADB: ఇంటి వద్దకే భద్రాద్రి రాముల వారి తలంబ్రాలు

శ్రీరామనవమి పురస్కరించుకుని భద్రాచలం వెళ్లలేని భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక సదుపాయం కల్పించిందని ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రతిమా రెడ్డి తెలిపారు. ఆర్టీసీ లాజిస్టిక్స్, దేవాదాయ శాఖ సహకారంతో సీతారాముల కళ్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే చేరవేసే కార్యక్రమం చేపట్టామన్నారు. జిల్లాలోని భక్తులు రూ.151 చెల్లించి ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో లేదా ఆన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చన్నారు.
News March 4, 2026
‘జనగణనను పారదర్శకంగా నిర్వహించండి’

అనంతపురం జిల్లా జనగణనను అధికారులు, సిబ్బంది బాధ్యతగా చేపట్టాలని డిఆర్ఓ, జిల్లా సెన్సెస్ అధికారి మలోలా సూచించారు. జేఎన్టీయూలో జరిగిన శిక్షణలో డిజిటల్ విధానంపై అవగాహన కల్పించారు. సీఎంఎంఎస్ ద్వారా 33 అంశాల నమోదు, మొబైల్ యాప్ వినియోగంపై వివరించారు. ఎక్కడా లోపాలు లేకుండా జనగణన పూర్తి చేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు.


