News May 3, 2024
బీజేపీతో కలవడానికి బీఆర్ఎస్ సిద్ధమైంది: సీఎం రేవంత్
TG: ఎన్నికల తర్వాత BJPతో కలవడానికి BRS సిద్ధమైందని సీఎం రేవంత్ అన్నారు. కరీంనగర్‌లో బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ యత్నిస్తోందని సిరిసిల్ల సభలో ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఏ చట్టం తెచ్చినా KCR సహకరించారని, తన కూతురు కవిత బెయిల్ కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. డిసెంబర్‌లో జరిగిన సెమీస్‌లో బీఆర్ఎస్‌ను ఓడించామని, ఫైనల్‌లో మోదీని ఓడించాలని వ్యాఖ్యానించారు.
Similar News
News December 27, 2024
సచిన్ టెండూల్కర్‌కు అరుదైన అవకాశం
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు అరుదైన అవకాశం లభించింది. ప్రతిష్ఠాత్మక మెల్‌బోర్న్ క్రికెట్ క్లబ్(MCC)లో గౌరవ సభ్యునిగా సచిన్‌కు చోటు దక్కింది. తమ నిర్ణయాన్ని ఆయన స్వాగతించారని MCC ట్వీట్ చేసింది. క్రికెట్‌కు అత్యుత్తమ సేవలు అందించిన సచిన్ MCCలో భాగమైనందుకు సంతోషంగా ఉందని పేర్కొంది. టెండూల్కర్ MCGలో 5 టెస్టులు ఆడగా 58.69 స్ట్రైక్ రేట్‌తో 449 పరుగులు చేశారు.
News December 27, 2024
విమానంలోనే ప్రెస్‌మీట్.. ఇది మన్మోహన్ స్టైల్
సైలెంట్ ప్రైమ్ మినిస్టర్ అంటూ తనను ప్రస్తావించడాన్ని మన్మోహన్ సింగ్ ఖండించేవారు. తాను మిగతావారిలా మీడియాతో మాట్లాడేందుకు భయపడేవాడిని కాదని చెప్పేవారు. విదేశీ పర్యటనలు ముగించి వచ్చేటపుడు ఆయన విమానంలోనే ప్రెస్ మీట్ నిర్వహించేవారు. ఏ అంశాన్ని మీడియా లేవనెత్తినా అనర్గళంగా మాట్లాడేవారు. 2004-2014 మధ్య కాలంలో ఆయన ప్రధానిగా 117 సార్లు ప్రెస్ మీట్ నిర్వహించారు. విదేశాల్లోనూ ప్రెస్‌తో మాట్లాడేవారు.
News December 27, 2024
సుజుకీ మాజీ ఛైర్మన్ కన్నుమూత
సుజుకీని ప్రపంచవ్యాప్తం చేసిన ఆ సంస్థ మాజీ ఛైర్మన్ ఓసాము సుజుకీ(94) కన్నుమూశారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఈనెల 25న మరణించారు. జపాన్‌లో 1930లో జన్మించిన ఓసాము 1958లో సుజుకీలో చేరారు. తక్కువ కాలంలోనే సంస్థకు గుర్తింపు తీసుకొచ్చారు. దాదాపు 21 ఏళ్ల పాటు సంస్థ ఛైర్మన్‌గా కొనసాగారు. ప్రస్తుతం భారత్‌లో మారుతీ సుజుకీ అతిపెద్ద కార్ల తయారీదారుగా ఉంది.