News May 3, 2024

యశ్‌కు సోదరిగా నటించనున్న నయనతార?

image

‘కేజీఎఫ్’ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమాలో నయనతార నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇందులో ఆమె యశ్‌కు సోదరిగా కనిపించనున్నారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మొదట ఈ పాత్రలో కరీనా కపూర్ నటిస్తున్నట్లు ప్రచారం జరగగా, డేట్లు సర్దుబాటు కాకపోవడంతో ఆమె తప్పుకున్నట్లు సమాచారం. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది.

Similar News

News November 14, 2025

సిద్దిపేట: ప్రేమ పేరుతో బాలికకు వేధింపులు

image

మైనర్‌ను ప్రేమ పేరుతో వేధించిన యువకుడిని సిద్దిపేట టూ టౌన్ పోలీసులు ఆరెస్ట్ చేశారు. ఇన్‌స్పెక్టర్ ఉపేందర్ తెలిపిన వివరాలిలా.. సిద్దిపేట డబుల్ బెడ్రూంలో నివాసం ఉంటున్న సమీర్ (22) ఈ నెల 10న రాత్రి బాలిక ఇంటికి వెళ్లాడు. ఆమె తల్లిదండ్రులతో తాను వారి అమ్మాయిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని వేధించాడు. వారి ఫిర్యాదు మేరకు యువకుడిపై కేసు నమోదైంది.

News November 14, 2025

దుల్కర్ ‘కాంత’ మూవీ పబ్లిక్ టాక్

image

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీబోర్సే జంటగా నటించిన ‘కాంత’ మూవీ ప్రీమియర్లు నిన్న పడ్డాయి. సినిమా థ్రిల్‌కు గురి చేస్తుందని మూవీ చూసినవారు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. దుల్కర్, భాగ్యశ్రీ యాక్టింగ్ అదిరిపోయిందని అంటున్నారు. విజువల్స్ బాగున్నాయని చెబుతున్నారు. అయితే సెకండాఫ్ కాస్త స్లోగా, బోరింగ్‌గా ఉందని మరికొందరు అంటున్నారు. మరికొన్ని గంటల్లో Way2News రివ్యూ.

News November 14, 2025

308 అప్రెంటిస్‌లు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌ 308 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. టెన్త్, ఐటీఐ, వొకేషనల్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్‌లు 300 ఉండగా.. వొకేషనల్ అప్రెంటిస్‌లు 8 ఉన్నాయి. అభ్యర్థుల వయసు కనీసం 18ఏళ్లు నిండి ఉండాలి. షార్ట్ లిస్టింగ్, విద్యార్హతలో మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cochinshipyard.in/